Share News

Midhun Reddy: ఏపీకి ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలి

ABN , Publish Date - Jul 29 , 2024 | 05:41 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇది విభజన చట్టంలో ఇచ్చిన హామీయేనని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలూ ప్రత్యేక హోదా ఇస్తామన్నాయని తెలిపారు.

Midhun Reddy: ఏపీకి ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలి
Midhun Reddy

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి (Midhun Reddy) డిమాండ్ చేశారు. ఇది విభజన చట్టంలో ఇచ్చిన హామీయేనని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలూ ప్రత్యేక హోదా ఇస్తామన్నాయని తెలిపారు. సోమవారం నాడు ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... హోదాకు బదులు ప్యాకేజీ అన్నది సరికాదు, ప్యాకేజీ హోదాతో సరిపోదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం ఒక పెద్ద తప్పిదం చేసిందని అన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తికాకుండానే డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టారని మిథున్ రెడ్డి మండిపడ్డారు.


Also Read: Sharmila: అన్నా నిన్ను మ్యూజియంలో పెట్టాలి.. జగన్‌పై షర్మిల విసుర్లు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు..

వరద ఉధృతికి కాఫర్ డ్యాం దాటుకుని డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని చెప్పారు. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు..? అని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి ఇచ్చేది రుణ రూపంలో కాకుండా గ్రాంట్ రూపంలో ఇవ్వాలని కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఆ ప్లాంటుకు సొంతంగా ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని కోరారు. ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేశారు. విశాఖపట్నం మెట్రో స్టేటస్ ఏంటో చెప్పాలని మిథున్‌రెడ్డి అడిగారు.


Also Read: CPI Ramakrishna: అమరావతికి కేంద్రం ఇచ్చే రూ.15వేల కోట్లు

తనపై దాడులకు పాల్పడ్డారు..

చంద్రబాబు సూపర్ - 6 హామీలు రాష్ట్రంలో ఇచ్చారు. అవి సారీ - 6గా మారకూడదని విమర్శించారు. తన నియోజకవర్గంలోకి వెళ్తే తనను అడ్డుకుని దాడులకు పాల్పడ్డారని, వాహనాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇంతా చేసి తనపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు ఇలా ఉంటే, రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. మూలధన వ్యయం కోసం కేటాయించిన రూ. 11 లక్షల కోట్లను ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టవద్దని కోరారు. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోనే ఆర్థిక వృద్ధి పెరుగుతుందని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vasantha Krishna Prasad: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. ప్రజలకు మంచి చేద్దాం..

Minister Nimmala: మంత్రి సాహసం.. స్వయంగా అక్కడికి ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి..

Purandeswari: ఏపీలో పథకాల మార్పుపై ఎంపీ పురందేశ్వరి ఏమన్నారంటే?

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 29 , 2024 | 05:47 PM