మంత్రాలయంలో భక్తుల కోలాహలం
ABN , Publish Date - Dec 14 , 2024 | 11:56 PM
రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. శని, ఆదివారం సెలవు దినాలు కావటంతో దక్షణాది రాష్ర్టాల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు.
మంత్రాలయం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. శని, ఆదివారం సెలవు దినాలు కావటంతో దక్షణాది రాష్ర్టాల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అద్దె రూములు దొరకక మధ్వమార్గ్ కారిడార్ ప్రాంగాణంలోనే చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు బసచేశారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న పీఠాధిపతి
రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ధార్మిక పర్యటనలో భాగంగా శనివారం తిరుమల తిరుపతి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పీఠాధిపతికి టీటీడీ ఈవో శ్యామలరావు, అర్చకులు, పండితులు స్వాగతం పలికారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని అనంతరం అక్కడ రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ద్వారపాలక అనంతస్వామి, టీటీడీ మఠం మేనేజర్ అనిల్ కుమార్, పవనాచార్, ప్రకాషాచార్, దేశాయ్ నరసింహ, అనంతపురాణిక్ పాల్గొన్నారు.