ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Devineni Uma: ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై దేవినేని ఉమ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Apr 11 , 2024 | 05:23 PM

ఏపీలో ఎలక్షన్ కోడ్ నడవట్లేదని వైసీపీ (YSRCP) కోడ్ కొనసాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheswara Rao) అన్నారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు దేవినేని మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ఎన్నికల ఉల్లంఘనలపై ప్రశ్నించిన ప్రజలపై ఆ పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

అమరావతి: ఏపీలో ఎలక్షన్ కోడ్ నడవట్లేదని వైసీపీ (YSRCP) కోడ్ కొనసాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheswara Rao) అన్నారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు దేవినేని మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ఎన్నికల ఉల్లంఘనలపై ప్రశ్నించిన ప్రజలపై ఆ పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.


Lokesh: కోయంబత్తూరుకు బయలుదేరిన నారా లోకేష్.. విషయం ఇదే!

పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ స్వామి భక్తి చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీకి కొమ్ముకాసే కొంతమంది పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.


Varla Ramaiah: ఆ ఇద్దరి చేతగానితనం వల్లే పోలీసులకు ఈ దుస్థితి

కోట్ల జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులు ఎవరికి పనిచేస్తున్నారు ? ఎవరికి సలహా ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. తాడేపల్లి నెస్ట్ స్పేస్ బిల్డింగ్‌లో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నడిపిస్తు్న్నారని అన్నారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు పనిచేయట్లేదా అని నిలదీశారు. ఐబీ ఎంబ్లమ్‌ను మార్చి ఫేక్ న్యూస్‌లు పోస్టింగ్ చేస్తున్నారని మండిపడ్డారు.


సజ్జల భార్గవ్ రెడ్డి దీనికంతటికి కీలక సూత్రధారని చెప్పారు. ఈ విషయాలపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఏం చర్యలు తీసుకున్నారు ? అని ప్రశ్నించారు. వెంటనే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై రైడ్స్ చేసి నిందితులను పట్టుకోవాలని కోరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై ఏపీ ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేస్తామని దేవినేని ఉమ అన్నారు.


ఇవి కూడా చదవండి

YS Sharmila: మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా?

Inter Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఇంటర్ రిజల్ట్స్.. పూర్తి వివరాలివే..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 11 , 2024 | 05:28 PM

Advertising
Advertising