Share News

గోశాలల నిర్మాణానికి సహకారం

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:25 AM

జగ్గంపేట, సెప్టెంబరు 6: నియోజకవర్గంలో రైతులకు అధిక మొత్తం రుణాలు మంజూరు చేసి గోశాలల నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆ

గోశాలల నిర్మాణానికి సహకారం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నెహ్రూ

జగ్గంపేట, సెప్టెంబరు 6: నియోజకవర్గంలో రైతులకు అధిక మొత్తం రుణాలు మంజూరు చేసి గోశాలల నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశించారు. రావులమ్మనగర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో నియోజకవర్గంలోని 4మండలాల ఎంపీడీవో లు, వెటర్నరీ వైద్యులు, ఉపాధిహామీ పథకం ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్‌ అసిస్టెంట్లతో నెహ్రూ రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. నియోజకవర్గంలో గోశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకువస్తానని, రైతులకు అన్ని విధాలా సహకరించాలన్నారు. నాలుగు మండలా ల వెటర్నరీ వైద్యులు, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 12:25 AM