Pinnelli Ramakrishna: పిన్నెల్లి బ్రదర్స్‌కు షెల్టర్ ఇచ్చింది ఎవరు..?
ABN, Publish Date - May 22 , 2024 | 03:27 PM
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), అతని బ్రదర్స్‌ను ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు.
మహబూబ్ నగర్: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), అతని బ్రదర్స్‌ను ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission of India) నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. మొత్తం-03 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ ప్రాంతాల్లో షెల్టర్
అయితే ఎమ్మెల్యే పిన్నెల్లికి మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో షెల్టర్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ఆంధ్ర మూలాలు గల పత్తి వ్యాపారులు పిన్నెల్లికి షెల్టర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు ప్రాంతాల్లో ఏపీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంతవరకు ఏపీ పోలీసులకు పిన్నెల్లి ఆచూకీ లభించలేదు.
పిన్నెల్లి ఇద్దరు సోదరులు కూడా ఇక్కడే ఉన్నట్లు ఖచ్చితమైన సమాచారం తెలుసుకుని ఏపీ పోలీసులు తనిఖీలు చేసినట్లు సమాచారం. ఒంగోలు జిల్లా పరుచూరుకి చెందిన రామనాథం బాబు అనే సీడ్ పత్తి వ్యాపారి పిన్నెల్లికి షెల్టర్ ఇచ్చినట్లు సమాచారం. రామనాథం బాబుకి చెందిన సాయి కృష్ణ సీడ్స్ పేరుతో గత ఏడాది వరకు ఓ కంపెనీ నడిచినట్లు తెలుస్తోంది. రామనాథం బాబు ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు.
ఏపీలోని పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే అతన్ని అరెస్ట్ చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు వెంటా కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫ్యాన్ పార్టీకి సీఈసీ చెక్..
అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..
అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..
బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 22 , 2024 | 04:10 PM