AP Highcourt: చంద్రబాబుపై నమోదైన కేసుల్లో దిగొచ్చిన ఏపీ సర్కార్
ABN, Publish Date - Apr 16 , 2024 | 02:28 PM
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, ఇతరులపై నమోదైన కేసుల్లో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇచ్చేందుకు సర్కార్ ముందుకొచ్చింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది. కేసుల వివరాలను చంద్రబాబు, ఇతరులకు మెయిల్‌లో పంపామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 16: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu), యువనేత నారా లోకేష్ (Nara Lokesh), ఇతరులపై నమోదైన కేసుల్లో ఏపీ ప్రభుత్వం(AP Government) దిగొచ్చింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇచ్చేందుకు సర్కార్ ముందుకొచ్చింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. కేసుల వివరాలను చంద్రబాబు, ఇతరులకు మెయిల్‌లో పంపామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఒకసారి మెయిల్ చెక్ చేసుకుని చెప్పాలని పిటిషనర్‌ల తరపున న్యాయవాదులను హైకోర్ట్ న్యాయమూర్తి కోరారు. మధ్యాహ్నంలోపు చెప్పాలని జడ్జి తెలిపారు.
YSRCP: 28 ఏళ్ల నిరీక్షణ.. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష
కాగా.. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నారాయణ, ఆయన్నపాత్రుడు, రామచంద్ర యాదవ్ పై కేసుల వివరాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మార్చ్ 1వ తేదిన డీజీపీకి లేఖ రాసినప్పటికీ నేటి వరకు వివరాలు ఇవ్వలేదని చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది ధమ్మాలపాటి శ్రీనివాస్ పిటీషన్ దాఖలు చేశారు. గత విచారణలో కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వివరాలు పేర్కొనకపోతే నామినేషన్లు తిరస్కరించే అవకాశం ఉందని కోర్టుకు పిటిషనర్ల తరపు లాయర్లు వివరించారు. ఈ సమాచారం మొత్తాన్ని ఇవ్వాలంటే ఎలా సాధ్యమవుతుందని, డీజీపీ కార్యాలయానికి ఇబ్బంది అవుతుందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు కూడా.
Akbaruddin Owaisi: మా బ్రదర్స్‌ను చంపాలని చూస్తున్నారు.. అక్బరుద్దీన్ సంచలనం!
అయితే గతంలో రఘురామకృష్ణరాజుపై ఉన్న కేసుల వివరాలను డీజీపీనే ఇచ్చారన్న విషయాన్ని పిటిషనర్‌ల తరపు న్యాయవాది గుర్తుచేశారు. కేసుల వివరాలు ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏంటంటూ జడ్జి ప్రశ్నిస్తూ.. డీజీపీని అడిగి వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. నేటికి విచారణ వాయిదా పడటంతో ఈరోజు మరోసారి హైకోర్టులో విచారణకు రాగా.. కేసుల వివరాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
ఇవి కూడా చదవండి...
AP Elections: జగన్‌పై దాడి చేసింది వాళ్లే.. ఆనం వీడియో వైరల్..
Big Breaking: జనసేన ఊపిరిపీల్చుకో.. హైకోర్టు గుడ్ న్యూస్!
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 16 , 2024 | 03:54 PM