Buddha Venkanna: కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకోవటంపై.. బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు
ABN, Publish Date - Jun 10 , 2024 | 08:18 PM
మాజీ ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్(ఎక్స్) వేదికగా నానిపై వెంకన్న వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
అమరావతి: మాజీ ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్(ఎక్స్) వేదికగా నానిపై వెంకన్న వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
చంద్రబాబుకు క్షమాపణలు చెప్పు..
‘‘అయ్యా కేశినేని నాని నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవడం కాదు, ప్రజలే నిన్ను తప్పించారు. రాష్ట్రమంతా వైసీపీ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే నిన్ను ఒక్కడినే విజయవాడ ప్రజలు ఓడించడం మరొక ఎత్తు.. 2సార్లు నిన్ను పార్లమెంట్‌కు పంపిన టీడీపీ అధినేత చంద్రబాబు గారిని పార్టీలోనే ఉంటూ ఇబ్బంది పెట్టినందుకు ప్రజలే నీకు బుద్ధి చెప్పారు. కనీసం నిన్ను 2సార్లు పార్లమెంట్‌కు పంపిన చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్పావా...? అలాగే 2వ సారి నువ్వు గెలిచినప్పుటి నుంచి నీ మాటలతో చంద్రబాబును బాధపెట్టినందుకు క్షమాపణలు చెప్పాలి’’ అని బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Jun 10 , 2024 | 08:22 PM