ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: డేట్, టైమ్ ఫిక్స్ చేయ్ జగన్..! ... సొంత జిల్లాలో చంద్రబాబు సవాల్!

ABN, Publish Date - May 02 , 2024 | 07:36 PM

ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా.. ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ప్రశ్నించారు. రాష్ట్రంలో సైకో(జగన్) ఉంటే.. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని విరుచుకుపడ్డారు.

Nara Chandrababu Naidu

తిరుపతి: ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా.. ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రశ్నించారు. రాష్ట్రంలో సైకో(జగన్) ఉంటే.. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని విరుచుకుపడ్డారు. రాయల వారు పరిపాలించిన నేల చంద్రగిరి అని తెలిపారు. ఇదే గడ్డపై విజనరీ లీడర్ అయిన తాను జన్మించానని తెలిపారు. తాను కాకుండా కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది ఈ జిల్లానే (చిత్తూరు) అని తెలిపారు. ‘‘నన్ను జగన్ పదే పదే ముసలోడని అంటున్నారు.. డేట్, టైం ఫిక్స్ చేయ్.. తిరుమల కొండకి నేను, నువ్వు కాలినడకన వెళ్దాం. ఎవరూ తర్వగా కొండపైకి వెళ్తారో చూద్దాం. అప్పుడు ముసలోడు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు’’ అని చంద్రబాబు సవాల్ విసిరారు.


AP Elections: నీవు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడా?..ముద్రగడపై పృథ్వి ఫైర్

తన హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించిందని చెప్పారు. జగన్ పాలనలోనూ రాష్ట్రం నెంబర్ 1గా ఉంది.. కానీ అభివృద్ధిలో కాకుండా గంజాయి, డ్రగ్స్, ప్రమాదకరమైన మద్యం విక్రయాల్లో నెంబర్ 1గా ఉందని చంద్రబాబు సెటైర్లు గుప్పించారు. తన హయాంలో జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తెచ్చానని అన్నారు. 50వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించానని చెప్పుకొచ్చారు. దేశంలో విక్రయిస్తున్న పలు ఉత్పత్తులు చిత్తూరు జిల్లా నుంచి తయారు చేస్తున్నావేనని తెలిపారు.తన హయాంలో రెండు డీఎస్సీలు వేసి.. 32వేల ఉద్యోగాలు భర్తీ చేశానని గుర్తుచేశారు. తన హయాంలో 11 డీఎస్సీలు వేసి.. లక్షా యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేశానని ఉద్ఘాటించారు.


Shashi Tharoor: బీజేపీ 300 కూడా దాటదు.. 400 ఒక జోక్

ఈ సైకో ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక పలు కంపెనీలు పక్క రాష్ట్రాలకు పోయాయని అన్నారు. తన హయాంలో ముకేష్ అంబానీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి.. 50వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు సముఖుత వ్యక్తం చేశారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీ కూడా వెళ్లిపోయిందని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు.. విదేశీ విద్యాలేదని చెప్పారు. కుప్పం మినహా మిగతా 13నియోజకవర్గాలల్లో వైసీపీని గెలిపించారని.. ఈ ఐదేళ్లల్లో జగన్ ఒక్క పరిశ్రమ కూడా ఎందుకు తీసుకు రాలేదని ప్రశ్నించారు. ఇసుక, మైన్స్, ల్యాండ్ ఇలా అన్నింటిని వైసీపీ నేతలు దోచేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.


మే 13న మీ ఓటుతో పాపాల పెద్దిరెడ్డి అండ్ కోకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పాడి రైతులకు పూర్వ వైభవం తీసుకొస్తానని మాటిచ్చారు. రాయలసీమను మ్యాన్‌ఫాక్చరింగ్ హబ్‌తో పాటు పర్యాటక కేంద్రం చేస్తానని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రతి ఏటా సింగల్ జాబ్ క్యాలెండర్‌తో ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాటిచ్చారు. చంద్రగిరిలో వైసీపీ నేత చెవిరెడ్డి రూ.2వేల కోట్లు దోచుకున్నారని.. ఇప్పుడు ఒంగోలుకు పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రగిరిలో చెవిరెడ్డి తన కొడుకుని మళ్లీ తీసుకొస్తున్నారని.. ప్రజలు మోసపోవద్దని చంద్రబాబు తెలిపారు.

AP Govt: ఎన్నికల వేళ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ దిమ్మతిరిగే షాక్!

Read latest AP News And Telugu News

Updated Date - May 02 , 2024 | 08:20 PM

Advertising
Advertising