AP Elections 2024: గాజుగ్లాస్ గుర్తుపై సీఈఓ ఎంకే మీనా కీలక ప్రకటన!
ABN, Publish Date - May 02 , 2024 | 05:44 PM
ఏపీలో మే-13న సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) జరుగుండటంతో ఎన్నికల సంఘం (Election Commission) పలు నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. అయితే.. అధికార వైసీపీ మాత్రం ఆ నియమాలను పాటించకుండా తుంగలో తొక్కుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
అమరావతి: ఏపీలో మే-13న సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) జరుగుండటంతో ఎన్నికల సంఘం (Election Commission) పలు నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. అయితే.. అధికార వైసీపీ మాత్రం ఆ నియమాలను పాటించకుండా తుంగలో తొక్కుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. మరోవైపు ఈసీకి కూడా లెక్కలేనన్ని ఫిర్యాదులు ప్రతిపక్షం నుంచి వెళ్లాయి. దీనిపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పందించారు. వైసీపీ కొన్ని ప్రకటనలలో రాష్ట్రం ప్రభుత్వం లోగోనో వాడొద్దని సూచించారు. ఇదివరకే ఈసీ అనుమతి కోసం వచ్చినప్పుడు బ్లర్ (కనిపించకుండా) చేసే చూపిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే.. ఇప్పుడు గవర్నమెంట్ లోగో ఉన్న ప్రకటనలను పూర్తిగా తొలగించాలని.. వైసీపీని మీనా ఆదేశించారు.
Shashi Tharoor: బీజేపీ 300 కూడా దాటదు.. 400 ఒక జోక్
పోలింగ్ ఏర్పాట్లపై సీఈఓ మీనా ఏమన్నారంటే...
ఏపీ ఎన్నికల్లో మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటు హక్కు వివియోగించుకోనున్నారని సీఈఓ మీనా తెలిపారు. ఫైనల్ ఎస్ఎస్ఆర్ కంటే తుది ఓటర్ల జాబితాలో 5.94 లక్షల మంది ఓటర్లు పెరిగారని తెలిపారు. ఏపీలో మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వివరించారు. ఇప్పటి వరకు రూ. 203 కోట్లు సీజ్ చేశామన్నారు. నగదుతో సహా మద్యం, గంజాయి, విలువైన ఆభరణాలను సీజ్ చేశామని చెప్పారు.
14 సెగ్మెంట్లల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ పెడుతున్నామన్నారు. అలాగే ఈ 14 సెగ్మెంట్లల్లో భద్రత కూడా పెంచుతామని చెప్పుకొచ్చారు. ఓటర్లకు ఎండతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. హోం ఓటింగ్ కోసం కేవలం 28,591 మంది మాత్రమే ఎంచుకున్నారని వివరించారు. మొత్తంగా 7,28,484 మంది హోం ఓటర్లు ఉంటే.. కేవలం 3 శాతం మాత్రమే హోం ఓటింగ్ కోరుకున్నారని తెలిపారు.
Big Breaking: అనంతపురంలో 2వేల కోట్ల నగదు పట్టివేత.. 4 కంటైనర్ల కథేంటి..!?
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు(గురువారం) నుంచే ప్రారంభమైంది.. ఈ నెల 8వ తేదీతో పూర్తి అవుతుందని చెప్పారు. 8 తేదీ లోగానే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు గాజు గ్లాస్ గుర్తును మొత్తంగా 15 చోట్ల మార్చినట్లు తెలిపారు. ఆ 15 స్థానాల్లో స్వతంత్రులకు వేరే గుర్తులు కేటాయించినట్లు వివరించారు. విశాఖలో పార్లమెంట్ పరిధిలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతున్నాయని చెప్పారు.
మంగళగిరి, తిరుపతి సెగ్మెంట్లల్లో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరమని చెప్పారు. 15 వేల బ్యాలెట్ యూనిట్లను అదనంగా తెప్పించినట్లు తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను పోలీస్ అధికారులకు పంపించినట్లు తెలిపారు. ఎవరికైనా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటే సెక్యూరిటీ ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు.374 మంది అసెంబ్లీ అభ్యర్థులకు.. 64 మంది పార్లమెంట్ అభ్యర్థులకు భద్రత కల్పించాలని పోలీస్ అబ్జర్వర్‌లు సూచించారని అన్నారు.
ఈ ఎన్నికల్లో 1.60 లక్షల బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నామన్నారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్లు ఎంత మేరకు వచ్చాయనేది ఇంకా ఫైనల్ కాలేదన్నారు. ఎన్నికల విధుల్లో 3.30 లక్షల మంది ఉన్నారని తెలిపారు. గోవా, హర్యానా, యానాం, తెలంగాణ నుంచి లిక్కర్ వస్తోందన్నారు.
గోవా, హర్యానా డీజీపీలతో తాము మాట్లాడామన్నారు. లిక్కర్ డంప్ , సరఫరా వెనుక ఒకరిద్దరికీ ఈ కేసుతో సంబంధముందని తెలిసిందన్నారు. ప్రతి జిల్లాలో ఎఫ్ఎస్టీ టీంలు నిఘా ఉన్నాయని తెలిపారు. మద్యం అక్రమాలను అరికడుతున్నామని ఏపీ సీఈఓ మీనా పేర్కొన్నారు.
Supreme Court: సీబీఐపై మా కంట్రోల్ లేదు.. సుప్రీం కోర్టుకు తేల్చి చెప్పిన కేంద్రం
Read latest AP News And Telugu News
Updated Date - May 02 , 2024 | 06:45 PM