AP Elections: పెరుగుతున్న కూటమి గ్రాఫ్.. ఆ రెండు జిల్లాల్లో వైసీపీకి నిరాశ తప్పదా..?
ABN, Publish Date - Apr 18 , 2024 | 01:52 PM
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టాలంటే 88 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. దీంతో మేజిక్ ఫిగర్ దాటేందుకు అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి. ఎన్నికల వ్యూహాలను రచిస్తూ ముందుకెళ్తున్నాయి. పవర్‌లోకి రావాలనుకునే ఏ పార్టీకైనా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని సీట్లు కీలకం కానున్నాయి. ఈ రెండు ఉమ్మడి జిల్లాలు కలిపి 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 34 సీట్లలో మోజార్టీ స్థానాలు గెలిస్తే అధికారానికి దగ్గరవ్వొచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టాలంటే 88 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. దీంతో మేజిక్ ఫిగర్ దాటేందుకు అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి. ఎన్నికల వ్యూహాలను రచిస్తూ ముందుకెళ్తున్నాయి. పవర్‌లోకి రావాలనుకునే ఏ పార్టీకైనా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని సీట్లు కీలకం కానున్నాయి. ఈ రెండు ఉమ్మడి జిల్లాలు కలిపి 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 34 సీట్లలో మోజార్టీ స్థానాలు గెలిస్తే అధికారానికి దగ్గరవ్వొచ్చు. 2019 ఎన్నికల్లో 34 సీట్లలో వైసీపీ 27 నియోజకవర్గాల్లో గెలుపొందింది. 6 నియోజకవర్గాల్లో టీడీపీ, ఒకచోట జనసేన అభ్యర్థులు గెలిచారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్డీయే కూటమి ఎక్కువ ఎమ్మెల్యేలను గెలుచుకుంది. దీంతో ఈ రెండు జిల్లాలపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి.
Loksabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ కీలక ఘట్టం
కూటమికి పెరుగుతున్న ఆదరణ
ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, పెద్దాపురం, మండపేటలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. రాజోలులో జనసేన అభ్యర్థి గెలిచారు. ఈ ఐదు మినహా మిగతా 14 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. ఇక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 15 సీట్లు ఉండగా.. టీడీపీ పాలకొల్లు, ఉండిలో మాత్రమే గెలిచింది. మిగతా 13 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు.
ప్రస్తుత ఎన్నికల్లో సీన్ పూర్తిగా మారిపోయింది. కూటమి వైపు ఈ రెండు జిల్లాల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. దీంతో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. సామాజిక సమీకరణల దృష్ట్యా జనసేనకు ఈ రెండు జిల్లాల్లో ఆదరణ ఉంటుంది. దీంతో ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. వైసీపీ తూర్పుగోదావరిలో 2 నుంచి 3, పశ్చిమగోదావరిలో ఒకటి నుంచి 2 స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈసారి ఈ రెండు జిల్లాలు వైసీపీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
పవన్ పోటీతో..
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.దీంతో ఆయన ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉండే అవకాశం లేకపోలేదు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ జిల్లాలోనూ ఆమె ప్రభావం ఉండవచ్చనే చర్చ జరుగుతోంది. దీంతో ఈసారి ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో టీడీపీ కూటమి కనీసం 28 నుంచి 30 సీట్లలో గెలిచే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి నిరాశ తప్పకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.
CM Jagan: తూ.గో. జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర నేడు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 18 , 2024 | 02:43 PM