ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: వారి ఓవరాక్షన్ ఎక్కువగా ఉంది.. తగ్గించుకోవాలి.. మాజీ సీఎం వార్నింగ్

ABN, Publish Date - May 05 , 2024 | 07:57 PM

తంబళ్లపల్లెలో పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువగా ఉందని, ఓవరాక్షన్ తగ్గించుకోకుంటే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఐ కూటమి అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. అంగళ్లులో కిరణ్ కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kiran Kumar Reddy

చిత్తూరు: తంబళ్లపల్లెలో పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువగా ఉందని, ఓవరాక్షన్ తగ్గించుకోకుంటే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) వార్నింగ్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఐ కూటమి అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. అంగళ్లులో కిరణ్ కుమార్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఐదేళ్ల నుంచి ఇసుక మాఫియా, భూ ఆక్రమణలు, దేవాదాయ భూములు ఆక్రమణలను అడ్డుకోవాలంటే వైసీపీ నేత ద్వారకనాథరెడ్డిని సదుమ్‌కు తరమాలని పిలుపునిచ్చారు.


PrajaGalam: ధర్మవరం వేదికగా పోలవరంపై అమిత్ షా కీలక ప్రకటన

గర్భిణీ మహిళపై వైసీపీ నాయకులు దారుణంగా దాడి చేశారని.. వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తాను సీఎంలుగా ఉన్నప్పుడు పాలసీలపైన పోరాడటమే కానీ.. చిత్తూరు జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని ఉద్ఘాటించారు. పెద్దిరెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. జయ చంద్రారెడ్డి నామినేషన్‌లో కూడా వైసీపీ నాయకులు అలజడి సృష్టించారని ఫైర్ అయ్యారు. టీచర్లు, పోలీసుల ప్రావిడెంట్ ఫండ్‌ను వారికి తెలియకుండా జగన్ ప్రభుత్వం విత్ డ్రా చేసిందని మండిపడ్డారు.


Sujana Choudary: వైసీపీ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

ఈ ఎన్నికల్లో కేంద్రంలో మోదీని మరోసారి ప్రధానిని చేయాలని... రాష్ట్రంలో చంద్రబాబును సీఎం చేయాలని కోరారు. ప్రజలు ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. తంబళ్లపల్లెలో 236 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎలాంటి దౌర్జన్యం చేసిన నేరుగా ఎన్నికల సంఘానికి వెళ్తుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కేంద్ర బలగాలు అప్రమత్తంగా ఉంటాయని.. తంబల్లపల్లె ఓటర్లు నిశ్చింతగా ఓట్లు వేయొచ్చని ధైర్యం చెప్పారు. కలికిరిలో ఈనెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజవంతం చేయాలని కిరణ్ కుమార్‌రెడ్డి కోరారు.

AP Elections: ఎన్నికల ముందు మరో కుట్ర.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు!!

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - May 05 , 2024 | 08:04 PM

Advertising
Advertising