YSRCP: ఓటర్లను ప్రలోభ పెట్టేలా మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు
ABN , Publish Date - May 13 , 2024 | 09:34 AM
ఓటర్లను ప్రలోభ పెట్టేలా మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేయడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఓటర్లను ప్రలోభ పెట్టేలా మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. యర్రాతివారిపల్లి 187 నంబర్ పోలింగ్ బూత్‌లో పెద్దిరెడ్డి ఓటు వేశారు. తమ పార్టీ గుర్తుకు ఓటు వేసినట్టు బహిరంగంగా మీడియాకు పెద్ది రెడ్డి వెల్లడించారు.
చిత్తూరు: ఓటర్లను ప్రలోభ పెట్టేలా మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేయడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఓటర్లను ప్రలోభ పెట్టేలా మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. యర్రాతివారిపల్లి 187 నంబర్ పోలింగ్ బూత్‌లో పెద్దిరెడ్డి ఓటు వేశారు. తమ పార్టీ గుర్తుకు ఓటు వేసినట్టు బహిరంగంగా మీడియాకు పెద్ది రెడ్డి వెల్లడించారు. పార్టీ గుర్తుల ప్రస్తావన చేయడం నిషేధం ఉన్నప్పటికీ .. ఓటు వేసిన గుర్తును పెద్దిరెడ్డి చెప్పడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఏపీలో పోలింగ్ మొదలవక ముందే పెద్దిరెడ్డి అరాచకం ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
AP Elections 2024: పోలింగ్ ప్రారంభానికి ముందే వైసీపీ అరాచకాలు.. ఒక్కోచోట ఒక్కోలా..
పెద్దిరెడ్డి అండ చూసుకుని ఏజెంట్లపై అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. ఇక పెద్దిరెడ్డి సొంతూరు సమీపంలోని చిత్తూరు జిల్లా బూరగమాందలో వైసీపీ నేతలు దారుణానికి తెగబడ్డారు. పోలింగ్ కేంద్రానికి వెళుతున్న ఐదుగురు టీడీపీ ఏజెంట్లను, మరో పదిమంది టీడీపీ నాయకులను వైసీపీ కిడ్నాప్ చేసి పీలేరు శివారులలో వదిలిపెట్టారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ మీరు పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్‌గా కూర్చోవడానికి వీల్లేదంటూ బెదిరింపులకు దిగారు. తోక జాడిస్తే అంతు చూస్తామంటూ టీడీపీ ఏజెంట్లను బెదిరింపులతో హడలెత్తించారు. గతంలోనూ సదుం మండలానికి చెందిన టీడీపీ ఆక్టివ్ నాయకుడు రాజారెడ్డిని వైసీపీ శ్రేణులు కాళ్లు విరిచి ఆసుపత్రిపాలు చేసిన పరిస్థితి తెలిసిందే. ఆ వ్యక్తి కూడా ఈరోజు కిడ్నాప్ చేసిన ముఖ్యుల్లో ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు పోలింగ్ కేంద్రాల్లో మొరాయించిన ఈవీఎంలు
కృష్ణాజిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులకు విధులు
వైసీపీ.. నాడు ధీమా.. నేడు డీలా!
Read Latest AP News and Telugu News