AP Poltics:పేర్ని నాని ఓ అవినీతిపరుడు.. జనసేన నేత కొరియర్ శ్రీను ఘాటైన విమర్శలు
ABN , Publish Date - Jun 10 , 2024 | 09:20 PM
మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani), అతని కుమారుడు పేర్ని కిట్టుపై జనసేన నేత కొరియర్ శ్రీను (Courier Srinu) ఘాటైన విమర్శలు గుప్పించారు. పేర్ని నాని ఓ అవినీతిపరుడని... ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఓ డ్రగిస్ట్ అని సంచలన ఆరోపణలు చేశారు.
కృష్ణాజిల్లా, (మచిలీపట్నం): మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani), అతని కుమారుడు పేర్ని కిట్టుపై జనసేన నేత కొరియర్ శ్రీను (Courier Srinu) ఘాటైన విమర్శలు గుప్పించారు. పేర్ని నాని ఓ అవినీతిపరుడని... ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఓ డ్రగిస్ట్ అని సంచలన ఆరోపణలు చేశారు. పేర్ని నాని చేసిన ప్రతి అవినీతికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని హెచ్చరించారు.వారానికి ఓ అవినీతి అంశాన్ని మీడియా ద్వారా ప్రజలకు చెబుతానని స్పష్టం చేశారు. నాని కుమారుడు కిట్టు డ్రగిస్ట్ కాకపోతే నార్కో టెస్ట్‌కి తీసుకురావాలని సవాల్ విసిరారు.
నార్కో టెస్ట్‌లో ఆయన కొడుకు డ్రగిస్ట్ కాదని తేలితే తాను మచిలీపట్నం వదిలి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. నాని, పవన్ పుప్పాల లాంటి .. పేటీఎం బ్యాచ్‌లతో ఐదేళ్లు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టించావో తెలియదా..? అని విమర్శలు గుప్పించారు. తమను సోషల్ మీడియాలో అవమానపరిచాడని మండిపడ్డారు. ఏ రోజైనా ఇది తప్పు అని ఖండించావా..!? అని ప్రశ్నించారు. బెల్ కంపెనీ ఎదురుగా 600 గజాల కాంట్రాక్టర్స్ అసోసియేషన్ స్థలాన్ని కబ్జాని అడ్డుకున్న తనపై కేసు పెట్టింది వాస్తవం కాదా..? అని కొరియర్ శ్రీను నిలదీశారు.