PM Modi: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మోదీ.. పీఎంఓ క్లారిటీ..!
ABN, Publish Date - Jun 10 , 2024 | 05:44 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారానికి దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు వస్తున్నట్లు సమాచారం.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈనెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారానికి దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు వస్తున్నట్లు సమాచారం. సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించి గన్నవరం దగ్గరలోని కేసరపల్లిలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెంన్నాయుడు పరిశీలిస్తున్నారు.
అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్‌గా ఉంది. ఈ సస్పెన్స్‌కు పీఎంఓ (PMO) తెరదించింది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని పీఎంఓ క్లారిటీ ఇచ్చింది. ప్రమాణ స్వీకారానికి మోదీ వస్తున్నారని ఏపీ ప్రభుత్వానికి పీఎంఓ సమాచారం ఇచ్చింది. కొద్దిసేపటి క్రితం మాజీ హోంమంత్రి అమిత్ షా కూడా వస్తున్నట్టు చంద్రబాబు పేషీకి అధికారులు సమాచారం ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల హాజరుపై చంద్రబాబు పేషీలోని ఆరా తీస్తునారు.
పలువురు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారానికి వస్తామని చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం. గన్నవరం ఎయిర్ పోర్టులో మొత్తం 12 హెలి ప్యాడ్లకు ఏర్పాట్లు చేశారు. ప్రధాని విమానంతో పాటు ఇతరుల విమానాల కోసం కూడా ఎయిర్ పోర్టు ఆధారిటి ఆఫ్ ఇండియా ఏర్పాట్లు చేసింది. వర్షాకాలం కావడంతో ఏర్పాట్లలో జాగ్రత్తగా ఉండాలని సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్ పోర్టు నుంచి ప్రమాణ స్వీకారోత్సవ వేదికకు వీఐపీల కాన్వాయి వెళ్లే దారిలో పటిష్ట బందోభస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, ప్రధాని భద్రత, తదితర విషయాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - Jun 10 , 2024 | 05:53 PM