Share News

AP Elections 2024: జోరుగా కొనసాగుతున్న పోలింగ్.. కోటిన్నరకు పైగా ఓట్లు నమోదు

ABN , Publish Date - May 13 , 2024 | 01:54 PM

ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. తమ అభిమాన పార్టీలకు ఓటు వేసేందుకు ఓటర్లందరూ పెద్దఎత్తున తరలి వస్తున్నారు. మధ్యాహ్నం 01:00 గంటల వరకు కోటిన్నరకు పైగా ఓటర్లు..

AP Elections 2024: జోరుగా కొనసాగుతున్న పోలింగ్.. కోటిన్నరకు పైగా ఓట్లు నమోదు

ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. తమ అభిమాన పార్టీలకు ఓటు వేసేందుకు ఓటర్లందరూ పెద్దఎత్తున తరలి వస్తున్నారు. మధ్యాహ్నం 01:00 గంటల వరకు కోటిన్నరకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఏపీలో మొత్తం 4.13 కోట్లకు పైగా ఓట్లు ఉండగా.. కోటిన్నరకు పైగా ఓట్లు పోలయ్యాయని, ఫలితంగా 35.95 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ ప్రకటించింది. పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్న ఓటర్లను చూస్తుంటే.. గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఈసీ వర్గాలు పేర్కొంటున్నాయి.


మహిళలదే జోరు

ఏపీలో 2.02 కోట్లకు పైగా పురుష ఓటర్లు ఉండగా.. మధ్యాహ్నం 01:00 గంటల వరకు 71 లక్షల మందికిపైగా (35.03%) ఓట్లు వేశారని ఈసీ తెలిపింది. అటు రాష్ట్రంలో మహిళా ఓటర్లు 2.10 కోట్లకు పైగా ఉండగా, 77 లక్షలకు పైగా (36.84%) మహిళలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని ఈసీ పేర్కొంది. పురుషులతో పోలిస్తే మహిళలే అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని ప్రకటించింది. కాగా.. ఏపీలోని ఓటర్ల చైతన్యం పెరిగింది. అన్ని వర్గాల ప్రజలు ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. ముఖ్యంగా.. మహిళలు, యువకులు జోరుగా ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు.

Read Latest AP News and Telugu News

Updated Date - May 13 , 2024 | 01:57 PM