ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: నుదిటిపై గాయం.. రక్తమోడుతోన్నా బెదరని ఏజెంట్

ABN, Publish Date - May 15 , 2024 | 03:21 AM

పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) అరాచకానికి అడ్డూ ఆదుపు ఉండదు! అయితే.. ఈ ఎన్నికల్లో ఓ మహిళ వీరనారిలా ముందుకొచ్చి ఆయనకు ఎదురు నిలిచారు. ఏజెంట్లుగా ఉండేందుకు పురుషులు తటపటాయిస్తున్న చోట ఏజెంట్‌గా కూర్చున్నారు. ఇది సహించలేక వైసీపీ (YSRCP) మూకలు ఆమెపై వేటకొడవళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.

tdp women leader

అరాచకాలపై ఎదురుతిరిగిన ఎమ్మెల్యే బంధువు మంజుల

రెచ్చిపోయి వేట కొడవళ్లతో దాడి చేసిన వైసీపీ మూకలు

నుదుటిపై తీవ్ర గాయమైనా బెదరకుండా బూత్‌లోనే విధులు

గుంటూరు, మే 14 (ఆంధ్రజ్యోతి):ల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) అరాచకానికి అడ్డూ ఆదుపు ఉండదు! అయితే.. ఈ ఎన్నికల్లో ఓ మహిళ వీరనారిలా ముందుకొచ్చి ఆయనకు ఎదురు నిలిచారు. ఏజెంట్లుగా ఉండేందుకు పురుషులు తటపటాయిస్తున్న చోట ఏజెంట్‌గా కూర్చున్నారు. ఇది సహించలేక వైసీపీ (YSRCP) మూకలు ఆమెపై వేటకొడవళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.


AP Elections: అంతలోనే మాట మారింది..?

నుదిటిపై పెద్ద గాయమై రక్తమోడుతున్నప్పటికీ ఆమె పోలింగ్‌ బూత్‌లోనే కూర్చున్నారు. ఆమె పేరు చేరెడ్డి మంజుల. ఎమ్మెల్యే పిన్నెల్లికి వరసకు మరదలు. మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం రెంటాల గ్రామ వాసి. మంజుల భర్త వెంకటేశ్వరరెడ్డి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. మొన్నటి వరకు వైసీపీలోనే ఉన్నారు. పిన్నెల్లి సోదరుల అకృత్యాలను, దౌర్జన్యాలను, అరాచకాలను చూస్తూ తట్టుకోలేక మార్చి 15న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.


AP Politics: టియర్ గ్యాస్‌ ఎఫెక్ట్.. జేసీకి అస్వస్థత

అప్పటి నుంచి మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుపు కోసం పాటుపడుతున్నారు. తీరా ఎన్నికలు సమీపించిన తరుణంలో రెంటాల పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్లుగా ఉండేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ నేపథ్యంలో మంజుల ఏజెంట్‌గా ఉన్నారు. సోమవారం ఉదయం పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాకముందే వైసీపీ మూకలు రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. మంజుల, ఆమె భర్త వెంకటేశ్వర రెడ్డిపై వేట కొడవళ్లతో దాడులు చేశారు.


ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర రెడ్డిని వెంటనే గురజాల ఆస్పత్రికి తరలించారు. మంజుల నుదిటిపై తీవ్ర గాయమై రక్తం ధారగా కారుతున్నప్పటికీ ఆ గాయంతోనే బూత్‌లో ఏజెంట్‌గా కూర్చుని తన కర్తవ్యం నిర్వర్తించారు. చివరకు పార్టీ నేతలు సర్ది చెప్పి మంజులను బయటకు తీసుకొచ్చి వైద్యం కోసం గురజాల ఆస్పత్రికి తరలించారు. మంజుల సాహసం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Pawan Kalyan: ఏపీలో రోడ్డు ప్రమాదాలపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2024 | 02:51 PM

Advertising
Advertising