Share News

AP Election 2024: వైసీపీలో చేరిన పోతిన మహేశ్

ABN , Publish Date - Apr 10 , 2024 | 12:45 PM

విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటు ఆశించి భంగపడి జనసేనకు గుడ్‌బై చెప్పిన పోతిన మహేశ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో బుధవారం ఆయన అధికార పార్టీలో చేరారు. పార్టీ కండువాను కప్పి పోతిన మహేశ్‌ను జగన్ ఆహ్వానించారు. పల్నాడు జిల్లాలో బస్సు యాత్రకు వెళ్లిన వైఎస్ జగన్‌ను ఆయన కలిశారు. కాగా పోతిన మహేశ్ ఇటీవలే జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

AP Election 2024: వైసీపీలో చేరిన పోతిన మహేశ్

పల్నాడు జిల్లా: విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటు ఆశించి భంగపడి జనసేనకు (Janasena) గుడ్‌బై చెప్పిన పోతిన మహేశ్ (Pothina Mahesh) వైసీపీ (YSRCP) తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) సారధ్యంలో బుధవారం ఆయన అధికార పార్టీలో చేరారు. పార్టీ కండువాను కప్పి పోతిన మహేశ్‌ను జగన్ ఆహ్వానించారు. పల్నాడు జిల్లాలో బస్సు యాత్రకు వెళ్లిన వైఎస్ జగన్‌ను ఆయన కలిశారు. కాగా పోతిన మహేశ్ ఇటీవలే జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.


కాగా పోతిన మహేశ్ రాజీనామా చేయడంతో విజయవాడలో జనసేన క్లోజ్ అయ్యిందని వైసీపీ వ్యాఖ్యానించింది. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కల్యాణ్ వెంట నడిచిన విజయవాడ వెస్ట్ ఇంఛార్జ్ పోతిన మహేశ్ ఈరోజు (బుధవారం) జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారని ఎక్స్ వేదికగా ప్రకటించింది. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి విజయవాడ వెస్ట్ టికెట్‌ను బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి పవన్ కల్యాణ్ అమ్ముకున్నారని అధికార పార్టీ ఆరోపించింది. కాగా పోతిన మహేశ్‌కు సీఎం జగన్ పార్టీ కండువాను కప్పిన వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

Perninani: వైసీపీ ఎమ్మెల్యే పేర్నినానిపై కేసు నమోదు.. ఎందుకంటే?

AP Election 2024: మా అడ్డాకి ఎవడు పంపించాడ్రా!

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2024 | 12:50 PM