AP Elections: జగన్, కూటమికి ఓటేస్తే బీజేపీని గెలిపించినట్టే: కేఏపాల్
ABN, Publish Date - May 09 , 2024 | 03:40 PM
Andhrapradesh: జగన్‌కు, కూటమికి ఓటు వేస్తే బీజేపీని గెలిపించినట్టే అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. బీసీ, దళిత, క్రైస్తవులు, ముస్లిం లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏడు నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీకి స్పందన అద్భుతంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీకి నాలుగు లక్షల ఓట్లు వస్తే...
విశాఖపట్నం, మే 9: జగన్‌కు, కూటమికి ఓటు వేస్తే బీజేపీని (BJP) గెలిపించినట్టే అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ (Prajashanti party Chief KA Paul) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. బీసీ, దళిత, క్రైస్తవులు, ముస్లిం లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏడు నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీకి స్పందన అద్భుతంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీకి నాలుగు లక్షల ఓట్లు వస్తే... ఈ ఎన్నికల్లో వైసీపీ ఎంపీకి కనీసం రెండు లక్షల కూడా రాని పరిస్థితి ఉందన్నారు. టీడీపీ ఎంపీ శ్రీభరత్ బీజేపీతో పొత్తు కారణంగా క్రిస్టియన్, మైనార్టీ ఓట్లు దూరమవుతాయన్నారు.
Uttamkumar: శంకరమ్మ కుటుంబ త్యాగం కాంగ్రెస్ మరవదు
విశాఖ నుంచి ఎంపీగా కేఏ పాల్‌ను పంపిద్దామని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. తాను గెలిస్తే ఎన్నికల్లో ఓట్లు వేయని వారిపై చర్యలు తీసుకునేలా చట్టం తీసుకొస్తానన్నారు. మోదీని ఢీకొట్టలేక... జగన్, చంద్రబాబు, పవన్ దాసోహం అయ్యారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌పై జగన్ మాట్లాడటం లేదని, గంగవరం పోర్టును అదానీకి అప్పగించడంలో జగన్ పాత్ర ఉందంటూ విమర్శలు గుప్పించారు. సర్వే ప్రకారం ఎంపీగా 5 లక్షల కోట్ల మెజారిటీతో తాను గెలవాలని భావిస్తున్నట్లు తెలిపారు. తాను గెలిస్తే 100 రోజుల్లో విశాఖపట్నం అభివృద్ధి చేస్తానని కేఏపాల్ ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
AP Election 2024: జిల్లాల వారీగా సర్వే వివరాలు ప్రకటించిన గోనె ప్రకాశరావు
AP Assembly Elections: కర్నూలు ‘కింగ్’ ఎవరు..?
Read Latest AP News And Telugu News
Updated Date - May 09 , 2024 | 04:55 PM