TDP Janasena Bjp Manifesto: ఆడబిడ్డల కోసం అదిరిపోయే స్కీమ్స్.. ఒక్కో పథకం ఒక్కో వండరే..
ABN, Publish Date - Apr 30 , 2024 | 04:24 PM
AP Elections 2024: ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ కూటమి(TDP Alliance) మేనిఫెస్టో (Manifesto) విడుదలైంది. రాష్ట్రంలో మహిళలపై వరాల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామంటూ ఆడబిడ్డల కోసం అదిరిపోయే స్కీమ్స్ ప్రకటించారు చంద్రబాబు(Chandrababu), పవన్
AP Elections 2024: ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ కూటమి(TDP Alliance) మేనిఫెస్టో (Manifesto) విడుదలైంది. రాష్ట్రంలో మహిళలపై వరాల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామంటూ ఆడబిడ్డల కోసం అదిరిపోయే స్కీమ్స్ ప్రకటించారు చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan). ముఖ్యంగా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా ఈ పథకాలను ప్రకటించారు.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టో మహిళల కోసం ప్రకటించిన ముఖ్యమైన పథకాలివే..
👉 రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.
👉 సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం.
👉 తల్లికి వందనం పథకం కింద ఒక్కో బిడ్డకు రూ. 15 వేలు.
👉 అలాగే నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి(పురుషులు/స్త్రీలు).
👉 డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు.
👉 ఆడపిల్లల విద్యకు కలలకు రెక్కలు పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు.
ఇవేకాకుండా మరికొన్ని పథకాలు కూడా అర్హులైన మహిళలకు వర్తింపజేయనున్నారు. ఆ పథకాలేంటో ఓసారి చూద్దాం..
👉 ప్రతి కుటుంబానికి జీవిత భీమా.
👉 డ్రైవర్లకు రూ. 15 వేలు.
👉 చంద్రన్న భీమా అమలు.
👉 హెల్త్ కార్డ్స్ మంజూరు.
👉 విద్యుత్ ఛార్జీలు నియంత్రణ.
👉 చెత్త పన్ను రద్దు.
👉 ఇంటి పన్నులపై సమీక్ష.
👉 ఉచిత ఇసుక విధానం అమలు.
👉 కేజీ టూ పీజీ సిలబస్‌పై రివ్యూ.
👉 అందరికీ విదేశీ విద్య.
👉 వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ కంట్రోల్ చేయడం.
👉 అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు అందివ్వడం.
👉 ఉద్యోగులకు పీఆర్సీ, ఆలోగా ఇంటెరిమ్ రిలీఫ్ ఇస్తారు.
👉 వలంటీర్లకు రూ. 10 వేలు జీతం.
👉 EWS రిజర్వేషన్ల నుంచి కాపులకు దామాషా పద్దతిన రిజర్వేషన్లు అమలు చేయడం.
👉 అగ్ర వర్ణ పేదలకు న్యాయం చేయడం.
👉 ఏప్రిల్ నుంచి రూ. 4 వేలు పెన్షన్ అమలు.
👉 వికలాంగులకు రూ. 6 వేలు పెన్షన్.
👉 పూర్తి వికలాంగులకు రూ. 10 వేల పెన్షన్.
👉 ఇప్పటికే మంజూరైన ఇళ్ల పట్టాల్లో ఇళ్లు కట్టి్స్తారు.
👉 20 లక్షల మంది యువతకు ఉపాధి.
👉 స్కిల్ గణన చేపడతాం.
👉 ఎంఎస్ఎంఈలకు ప్రొత్సాహాకాలు.
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 30 , 2024 | 04:24 PM