AP Elections: జగన్‌పై విరుచుకుపడ్డ దేవినేని ఉమా
ABN, Publish Date - May 09 , 2024 | 04:48 PM
Andhrapradesh: జిల్లాలోని బుట్టాయిగూడెం మండల టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలు గురువారం సమావేశమయ్యారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ, పోలవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు , టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. 72 శాతం పోలవరం ప్రాజెక్టును టీడీపీ పూర్తి చేస్తే.. జగన్ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
ఏలూరు, మే 9: జిల్లాలోని బుట్టాయిగూడెం మండల టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలు గురువారం సమావేశమయ్యారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ (TDP Leader Devineni Uma), పోలవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు (Janasena MLA Candidate Chirri Balaraju) , టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. 72 శాతం పోలవరం ప్రాజెక్టును టీడీపీ పూర్తి చేస్తే.. జగన్ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పోలవరం (Polavaram Project) పూర్తి అయితే లక్షల ఎకరాలకు సాగు, త్రాగు నీరు అందుతుందన్నారు.
AP Elections: చంద్రబాబు రాజకీయాల్లో ఓనమాలు నేర్పారు: సుజనా చౌదరి
జగన్ ప్రభుత్వంలో (Jagan Government) ప్రాజెక్టులు అన్నీ పడకేసాయని విమర్శించారు. ప్రాజెక్టు సమాచారం బయటకు వెళ్లకుండా అడ్డుకట్ట వేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు సందర్శన ఏర్పాటు చేశామన్నారు. నిర్వాసితులకి జగన్ (CM Jagan) రూ.19 లక్షలు ఇస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు. నిర్వాసితులకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. 5 వేల కోట్లు మంజూరు అయిన చింతలపూడి ఎత్తి పోతల పథకాన్ని గాలికి వదిలేశారన్నారు. రాష్ట్రంలో పలు సమస్యలు పరిష్కరించాకే ఓటు అడుగుతానని జగన్ అన్నారని.. అనేక సమస్యలు పెండింగ్‌లో ఉంచుకుని జగన్ ఓటు ఎలా అడుగుతారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
AP Elections 2024: కర్నూలు ‘సిటీ’ని ఏలేదెవరు..?
Lok Sabha Election 2024:రేవంత్ నా సవాల్‌ను స్వీకరించకుండానే డైలాగ్‌లు కొడుతున్నారు: హరీశ్‌రావు
Read Latest AP News And Telugu News
Updated Date - May 09 , 2024 | 04:55 PM