ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections2024: పిన్నెల్లి మా ఫ్యామిలీని చంపేస్తాడు..చంద్రబాబు అండ మాకు కావాలి: టీడీపీ నేత మాణిక్యరావు

ABN, Publish Date - May 26 , 2024 | 05:51 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ తర్వాత మాచర్లలో పెద్దఎత్తున అల్లర్లు, అరాచకాలు జరిగిన సంగతి తెలిసిందే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పాల్పడిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలింగ్ రోజు టీడీపీ పోలింగ్ ఏజెంట్, టీడీపీ నేత మాణిక్యరావుని (Manikya Rao) పిన్నెల్లి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి దారుణంగా హింసించి కొట్టారు. ఈ విషయంపై మాణిక్యరావు ఆదివారం ఏబీఎన్‌తో తన ఆవేదనను పంచుకున్నారు.

పల్నాడు: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ తర్వాత మాచర్లలో పెద్దఎత్తున అల్లర్లు, అరాచకాలు జరిగిన సంగతి తెలిసిందే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పాల్పడిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలింగ్ రోజు టీడీపీ పోలింగ్ ఏజెంట్, టీడీపీ నేత మాణిక్యరావుని (Manikya Rao) పిన్నెల్లి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి దారుణంగా హింసించి కొట్టారు. ఈ విషయంపై మాణిక్యరావు ఆదివారం ఏబీఎన్‌తో తన ఆవేదనను పంచుకున్నారు.


డీఎస్పీ ముందే దాడి

‘‘వెంకట్రామిరెడ్డి నన్ను దుర్భాషలాడారు. అంతుచూస్తామని బెదిరించారు. పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు. టీడీపీ ఏజెంట్‌గా కూర్చునే ధైర్యం నీకెక్కడిది అంటూ దాడి చేశారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నా కుటుంబంపైనా దాడి చేశారు.పిన్నెల్లి అనుచరులు నా పెద్దకుమారుడి పొట్టపైనా తన్నారు. ప్రాణాలకు తెగించి టీడీపీ పోలింగ్ ఏజెంట్‌గా కూర్చున్నా. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని నా వదిన కాళ్లు పట్టుకుని బతిమాలినా వదల్లేదు. నా కుటుంబంపై పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి అంత కక్ష ఎందుకు? పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి భయపడి అధికారులు నోరు మెదపలేదు. నాపై దాడి చేస్తున్నా పోలీసులు స్పందించలేదు. డీఎస్పీ ఉండగానే పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నాపై దాడికి యత్నించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డీఎస్పీని సైతం వెంకట్రామిరెడ్డి బెదిరించారు. పిన్నెల్లి మా ఫ్యామిలీని చంపేస్తాడు..చంద్రబాబు అండ మాకు కావాలి. పిన్నెల్లి సోదరుల కంటే కిమ్ బెటర్. నన్ను చంపేంత తప్పు నేను ఏం చేశాను? వైసీపీ చేస్తున్న రిగ్గింగ్‌ను అడ్డుకోవడమే నేను చేసిన తప్పా’’ అని పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బాధితుడు మాణిక్యరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: పిన్నెల్లి బాధితుడు నోముల మాణిక్యాల రావు ఫిర్యాదు.. నిరాకరించిన మంగళగిరి పోలీసులు

AP News: ఆయన ఆరోపణలు వాస్తవం కాదు.. లీగల్ నోటిసులు పంపిస్తాం.. సీఎస్ కార్యాలయం ప్రకటన

AP Elections2024: సీఎస్ కుమారుడి భూదోపిడిపై వర్ల రామయ్య సంచలన ఆరోపణలు

AP Elections: సీఎస్ జవహర్ నిరూపిస్తే.. కాళ్లు పట్టుకుంటా!

Mla Pinnelli: పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు..!!

AP elections: వాటిని సాకుగా చూపి పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదు: ముకేశ్ కుమార్ మీనా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 26 , 2024 | 09:39 PM

Advertising
Advertising