Share News

AP News: గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల దందా..

ABN , Publish Date - Mar 05 , 2024 | 01:46 PM

గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల దందా వెలుగు చూసింది. గత ఎన్నికలకు ముందు కూడా ఇలానే 11 వేల నకిలీ పత్రాలను మాజీ ఎమ్మెల్యే వంశీ పంపిణీ చేశారు. అప్పట్లో బాపులుపాడు మండలానికే నకిలీ పట్టాల పంపిణీ పరిమితమైంది.

AP News: గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల దందా..

విజయవాడ: గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల దందా వెలుగు చూసింది. గత ఎన్నికలకు ముందు కూడా ఇలానే 11 వేల నకిలీ పత్రాలను మాజీ ఎమ్మెల్యే వంశీ (EX MLA Vamsi) పంపిణీ చేశారు. అప్పట్లో బాపులుపాడు మండలానికే నకిలీ పట్టాల పంపిణీ పరిమితమైంది. ఇప్పుడు నియోజకవర్గం మొత్తం నకిలీ పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో పట్టాల పంపిణీకి వంశీ అనుచరులు రంగం సిద్ధం చేశారు.

Nara Lokesh: జగన్ కంపెనీలు కళకళ...రాష్ట్ర ఖజానా దివాళ!

ఇటీవల పార్టీ మారినందుకు వంశీని అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) అనర్హుడిగా ప్రకటించారు. అయినా ఎమ్మెల్యేగా చలామణి అవుతూ ఇంకా పట్టాలు పంపిణీ చేయడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు (Yarlagadda Venkatrao) ఫిర్యాదు చేశారు. ఈ రోజు రంగన్నగూడెంలో వంశీతో పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. చెరువు, ఇతర ప్రాంతాల్లో పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో యార్లగడ్డ పేర్కొన్నారు.

Satya Kumar: గుక్కెడు మంచినీరు అడగడమే నేరమా? దానికే కేసులు హత్యలా?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 01:46 PM