Prathipati: చెల్లికే అన్నపై నమ్మకం లేకుంటే.. ఇక మాలాంటి వాళ్ల పరిస్థితేంటి?
ABN , Publish Date - Mar 01 , 2024 | 03:11 PM
Andhrapradesh: గద్దె దిగే సమయంలో కూడా జగన్ తన విధ్వంసం విధ్వేషాన్ని కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్త్ం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నిన్న.. నా కుమారుడు శరత్ ను 16 గంటల పాటు గుర్తు తెలియని ప్రాంతాల్లో తిప్పారు. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కోలేక.. అక్రమ కేసులు పెట్టి నా కుమారుడిని అరెస్టు చేసి నన్ను నైతికంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు’’ అని మండిపడ్డారు.
అమరావతి, మార్చి 1: గద్దె దిగే సమయంలో కూడా జగన్ (CM Jagan) తన విధ్వంసం విధ్వేషాన్ని కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Former Minister Prathipati Pullarao) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నిన్న.. నా కుమారుడు శరత్ ను 16 గంటల పాటు గుర్తు తెలియని ప్రాంతాల్లో తిప్పారు. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కోలేక.. అక్రమ కేసులు పెట్టి నా కుమారుడిని అరెస్టు చేసి నన్ను నైతికంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. బెదిరింపులకు భయపడేది లేదు. నేను న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకున్నా. అరాచకం అకృత్యాలు నమ్ముకున్న జగన్‌ను అవే తొక్కిపెట్టడతాయి. ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరి ఆదీనంలో ఉంది? ప్రతిపక్షాలపై కక్ష సాధింపు కోసమేనా ప్రభుత్వానికి సంబంధం లేకుండా రెవెన్యూ ఇంటెలిజెన్స్ సృష్టించింది? డీఆర్ఐ ఇప్పటివరకు పెట్టిన కేసులన్నీ తెలుగుదేశం నేతలపైనే. తెలుగుదేశం జనసేన సభలు విజయవంతం అవుతుండటంతో వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డీఆర్ఐ అక్రమ కేసుల్ని తెరపైకి తెస్తోంది. చెల్లికే అన్నపై నమ్మకం లేకుంటే, ఇక మాలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి.. నా కుమారుడిపై పెట్టిన కేసే నిదర్శనం. వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి.. తన వికృత చేష్టలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నాడు. జగన్ రెడ్డి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ, నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు’’ అని ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.
Lasya Nanditha: లాస్య నందిత కారు ఢీ కొన్నది ఇదిగో ఈ టిప్పర్ లారీనే.. అసలేం జరిగింది..!?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...