Achchennaidu: వ్యవస్థలను జగన్ నాశనం చేశారు.. అచ్చెన్నాయుడు ఫైర్
ABN, Publish Date - Jun 25 , 2024 | 09:00 PM
ఖరీఫ్‌లో అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సూచించారు. ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతి: ఖరీఫ్‌లో అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సూచించారు. ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తనపై ఉన్న నమ్మకంతోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ అప్పగించారని తెలిపారు. జాతీయ స్థాయిలో ఏపీ వ్యవసాయ శాఖను ఆదర్శ శాఖగా తీర్చిదిద్దుతానని అచ్చెన్న హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని విమర్శించారు.
వైట్‌హౌస్ తరహాలో అన్ని జిల్లాలోనూ పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టాలను జగన్ అతిక్రమించడం అన్యాయమన్నారు. వైసీపీ అవినీతి అక్రమాలపై విచారణ చేస్తామని అచ్చెన్న ప్రకటించారు. వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారు. ఎవరిపైన వ్యక్తిగత దాడులకు పోమని అన్నారు. చట్టప్రకారం, ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు పాలన చేస్తారని పేర్కొన్నారు.
Updated Date - Jun 25 , 2024 | 09:18 PM