ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Cabinet: రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

ABN, Publish Date - Nov 06 , 2024 | 04:49 PM

విశాఖ రుషికొండ ప్యాలెస్‌లో ఒక్క కబోర్డు కోసం రూ.60 లక్షలు ఖర్చు చేయడంపై సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫర్నిచర్, ఫ్లోరింగ్, ఆర్కిటెక్చర్ వంటి పనుల కోసం వందల కోట్లు వెచ్చించారని ఆయన తెలిపారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ (AP Cabinet) సమావేశంలో విశాఖ రుషికొండ ప్యాలెస్‌ (Rushikonda Palace)పై సుదీర్ఘ చర్చ జరిగింది. తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ అటువంటి ఇంద్ర భవనాన్ని చూడలేదని క్యాబినెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) చెప్పారు. ఇటీవల తాను రుషికొండ ప్యాలెస్‌ను చూసి వచ్చినట్లు మంత్రులకు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ తన విలాసాల కోసం భవన నిర్మాణానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.


రుషికొండ ప్యాలెస్‌లో ఒక్క కబోర్డు కోసం రూ.60 లక్షలు ఖర్చు చేయడంపై సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫర్నిచర్, ఫ్లోరింగ్, ఆర్కిటెక్చర్ వంటి పనుల కోసం వందల కోట్లు వెచ్చించారని సీఎం తెలిపారు. జగన్ కోసం నిర్మించిన భవనం రాజ భవనాన్ని తలపిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సైతం ముఖ్యమంత్రికి చెప్పారు. ఆయన బయటకు వచ్చే మార్గాన్ని రాజమార్గంగా తీర్చిదిద్దారని దుర్గేశ్ తెలిపారు. దాన్ని నిర్మించేందుకు కోట్ల రూపాయలు వెచ్చించారని పర్యాటక శాఖ అధికారులు చెప్పారని సీఎం దృష్టికి మంత్రి తీసుకెళ్లారు.


పేదలు, ఇల్లు లేని వారు, పల్లెల నుంచి రైతులను తీసుకువెళ్లి రుషికొండ భవనాన్ని వారికి చూపించాలని మెజారిటీ మంత్రులు సీఎం చంద్రబాబును కోరారు. ప్యాలెస్‌ను అందరికీ చూపిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడు జగన్ చేసిన అధికార దుర్వినియోగం గురించి అందరికీ తెలుస్తుందని చెప్పారు. అలాగే ప్రజా ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చారో ప్రజలందరికీ తెలుస్తుందని తెలిపారు. పేదల గురించి జగన్ బయటకు మాట్లాడతారని, కానీ ఆయన మాత్రం ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని మంత్రులు మండిపడ్డారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రిని వారంతా కోరారు. అయితే మంత్రుల మాటలకు స్పందించిన చంద్రబాబు త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుందామని వారికి చెప్పారు. రుషికొండ భవనాన్ని ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై మంత్రులందరూ సలహాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు వారని కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి:

AP Cabinet: ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా ఏపీ కేబినెట్ భేటీ

AP Cabinet: ఎస్పీలపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్.. ఫోన్ చేస్తే రియాక్ట్ కావడం లేదు..

US Elections Result 2024: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

Updated Date - Nov 06 , 2024 | 04:56 PM