Jagan: ఏపీలో లా అండ్ అర్డర్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 23 , 2024 | 02:35 PM
Andhrapradesh: ఏపీలో లా అండ్ ఆర్డర్‌పై వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అలాగే తమ హయాంలో మహిళ కోసం తీసుకువచ్చిన పథకాలపై మాట్లాడారు. ఆ పథకాలన్నింటినీ కూటమి ప్రభుత్వం ఎత్తేసిందని మండిపడ్డారు.
గుంటూరు, అక్టోబర్ 23: ఏపీలో లా అండ్ ఆర్డ్‌ర్‌పై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో బ్రెయిన్ డెడ్ అయిన సహానా కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందన్నారు. ఒక దళిత చెల్లి బలై పోయిందని విమర్శించారు. వైసీపీ పాలనలో మహిళలకు భరోసా ఇచ్చామని.. దిశ యాప్ అందుబాటులోకి తెచ్చామని చెప్పుకొచ్చారు.
Telangana: కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..
ఎస్‌ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులను పంపించే వాళ్ళమన్నారు. చేసిన వాడు మన వాడైతే ఏం చేసినా పర్వాలేదు అన్న సంకేతాలు పంపుతున్నారని విమర్శించారు. గుంటూరులో దయనీయమైన ఘటన జరిగిందని... ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో చూశామన్నారు. సీఎం చంద్రబాబుతో నిందితుడు దిగిన ఫోటోలు ఉన్నాయన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ధర్మం పాటించాలన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చారని.. ప్రభుత్వం నుంచి ఎవరూ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేవలం టీడీపీకి చెందిన యువకుడు కావడంతోనే ప్రభుత్వం స్పందించ లేదని విమర్శించారు.
పవన్, బాలయ్య ఎందుకు వెళ్లలేదు..
తెనాలి మంత్రి కూడా బాధితురాలిని చూసేందుకు రాలేదన్నారు. ‘‘నేను వస్తున్నానని తెలుసుకొని ఆలపాటి రాజా వచ్చాడంట. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం ఇచ్చి ఎందుకు ఆదుకోలేదు. నిందితుడికి చంద్రబాబు కండువా కప్పిన ఫోటోలున్నాయి. ఎంపీ చంద్రశేఖర్‌తో నిందితుడు సన్నిహితంగా ఉన్నాడు. నిందితుడిని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నారు. బద్వేలు ఘటన, శ్రీకాకుళంలో ఇద్దరిపై అత్యాచారం ఘటన. చేసింది ఎవరూ అంటే టీడీపీకి చెందిన ప్రబుద్దులు. పిఠాపురంలో టీడీపీ నాయకుడు పదహారేళ్ళ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటారు. యువతిని పరామర్శించారా.. ఇంటికి వెళ్ళారా. హిందూపురంలో అత్తా కోడళ్ళుపై గ్యాంగ్ రేప్ జరిగింది. మూడు రోజుల పాటు నిందితులను అరెస్టు చేయలేదు. ఎమ్మెల్యే బాలకృష్ణ చూడటానికి కూడా వెళ్ళలేదు’’ అంటూ విమర్శించారు.
Maharashtra Elections: అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన ఎన్సీపీ
రెడ్ బుక్ పాలనలో పోలీసులు...
రెడ్ బుక్ పాలనలో పోలీసులు నిమగ్నమయ్యారని వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలను అరికట్టలేకపోయారన్నారు. చంద్రబాబు పాలనలోకి వచ్చిన మూడు నెలల్లో 77 మందిపై అత్యాచారాలు జరిగాయని.. ఏడు మంది హత్యకు గురయ్యారని తెలిపారు. ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా అంటూ మండిపడ్డారు. రెడ్ బుక్ పాలనలో ఏమైనా చేయండి వెనకేసుకొస్తామని చంద్రబాబు అంటున్నారన్నారు. ఫోక్సో కోర్టులు, మహిళా కోర్టులు ఏర్పాటు చేశామని.. దిశ వాహనాలను ఇచ్చామని వెల్లడించారు. 19 జాతీయ అవార్డులు దిశా యాప్‌కు వచ్చాయన్నారు. పథకాలన్నీ ఎత్తి వేశారని.. మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. మహిళలు బ్రతకడానికి ఇబ్బంది పడే స్థితికి తీసుకొచ్చారని అన్నారు. వైసీపీ నుంచి ప్రతీ బాధిత కుటుంబానికి పదిలక్షలు ఇస్తున్నామని.. తాము వచ్చిన తర్వాత ఏరి ఏరి నిందితులను పట్టుకుని జైలులో పెట్టిస్తామని స్పష్టం చేశారు. తప్పు జరిగిందని ఒప్పుకొని దర్యాప్తు చేయాలన్నారు. ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. బాధితుల తరుపున వైసీపీ నిలబడుతుంటే రాజకీయం చేయడం ధర్మమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దళితులంతా నా బంధువులే నా దగ్గరి వాళ్ళే’’ అంటూ జగన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Chennai: బంగాళాఖాతంలో తుఫాన్.. 5 రోజుల వర్షసూచన
CM Chandrababu: ప్రేమోన్మాదానికి బలైన విద్యార్థిని కుటుంబానికి సీఎం చంద్రబాబు పరామర్శ
Read Latest AP News And Telugu News