Kollu Ravindra: వైసీపీ హయాంలో తాగునీటి కష్టాలు.. కొల్లు రవీంద్ర విసుర్లు
ABN, Publish Date - Jul 30 , 2024 | 06:51 PM
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాగునీటి కష్టాలు వచ్చాయని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కాల్వల్లో పారెడు మట్టి కూడా తీయలేకపోయారని మండిపడ్డారు.
కృష్ణా: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాగునీటి కష్టాలు వచ్చాయని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కాల్వల్లో పారెడు మట్టి కూడా తీయలేకపోయారని మండిపడ్డారు. కాల్వల మరమ్మతులు చేయకుండా బిల్లులు చేసుకున్నారని విమర్శించారు. మంగళవారం నాడు నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... పట్టిసీమ పంపులను పక్కన పడేయాలని చూశారని విమర్శించారు.
40టీఎంసీల నీటిని నిలబెట్టగలిగే పులిచింతలలో 0.8టీఎంసీల లెవల్‌కు పడేశారని చెప్పారు. సాగర్, శ్రీశైలంలో నీళ్లు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక పులిచింతలను మళ్లీ అందుబాటులోకి తెచ్చామని ఉద్ఘాటించారు. 21 పంపుల ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించామని వివరించారు. వ్యవసాయానికి 10వేల క్యూసెక్కుల సాగునీరు అవసరం ఉందని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 5వేల క్యూసెక్కుల నీళ్లే ఉన్నాయన్నారు. 10వేల క్యూసెక్కుల నీళ్లు కావాలంటే పై నుంచి నీళ్లు రావాలని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.
Also Read: YS Sharmila: ఆరోగ్య శ్రీపై అనుమానాలు కలిగించొద్దు.. ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి
ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి కేఆర్ఎంబీ నుంచి 10వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చేలా కృషి చేస్తామని మాటిచ్చారు. ఇంకా 4వేల కేసుల వరకు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రూ.480 కోట్లు రావల్సి ఉండగా ఒక్క కృష్ణా జిల్లాలోనే రూ.45కోట్లు రావల్సి ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే బిల్లులు విడుదలయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Kollu Ravindra: వైసీపీ హయాంలో తాగునీటి కష్టాలు.. కొల్లు రవీంద్ర విసుర్లు
Ram Prasad Reddy: వైసీపీ పాలనలో పెద్దఎత్తున భూదోపిడీ
AP News: గత ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిందన్న అధికారులు
GVL: రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎందుకు నష్టపోయిందంటే..: జీవీఎల్
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 30 , 2024 | 10:38 PM