ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manohar: ఆ లెక్కలపై తేల్చుకుందాం రండి.. వైసీపీ నేతలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సవాల్

ABN, Publish Date - Dec 14 , 2024 | 12:30 PM

ధాన్యం అమ్మకాల్లో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వర్షం వస్తే ధాన్యం తడిసిపోకుండా రైతులకు అందించేందుకు టార్బాన్లు సైతం మొదటిసారి అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మిల్లర్లకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించామని అన్నారు.

అమరావతి: కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరిస్తూ.. అండగా ఉంటుందని ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ నేతలపై ట్విట్టర్(ఎక్స్) వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు రైతులకు భరోసాగా నిలుస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. వైసీపీ పాలనలో గత ఖరీఫ్ సీజన్లో డిసెంబర్ 13నాటికి- 9,40,936 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ చేసిందని.. కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకూ 16,34,151 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని వివరించారు. కలెక్టరేట్ల దగ్గరకు బస్తాలు మోసుకువెళ్లి వైసీపీ నేతలు ఫొటో‌షూట్ చేశారని విమర్శించారు. గత సీజన్లో గుంటూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కనీసం సేకరణ ఎందుకు చేపట్టలేదని అన్నారు.


కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ధాన్యం కొనుగోలులో అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించకుండా వారిని మోసం చేసిందని ఆయన ఆగ్రహించారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను సైతం చంద్రబాబు సర్కారే చెల్లించినట్లు మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ఈ ఏడాది సంక్రాంతి రాకముందే రైతులు కళ్లల్లో ఆనందం కనపడుతోందని మంత్రి చెప్పారు. రైతులకు అండగా నిలబడకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్షల కోట్ల బడ్జెట్ వృథాగా మారుతుందన్నారు. అందుకే వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.


సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పుడూ రైతుల గురించే ఆలోచిస్తారని తెలిపారు. వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో నిరంతరం కష్టపడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కంటే కూటమి ప్రభుత్వంలో ధాన్యం దిగుబడి అధికంగాఉందన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ధాన్యం అమ్మకాల్లో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. అలా ఆందోళన చెంది దళారులకు తక్కువ ధరకే విక్రయించవద్దని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర దక్కాల్సిందేనని అన్నారు. అందుకు ప్రభుత్వం అన్నీ చర్యలు చేపట్టిందని... ధాన్యంలో తేమ 20 శాతం వరకు ఉన్నా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. వర్షం వస్తే ధాన్యం తడిసిపోకుండా రైతులకు అందించేందుకు టార్బాన్లు సైతం మొదటిసారి అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మిల్లర్లకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించామని అన్నారు. కాబట్టి వారంతా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైతులను ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu: జమిలి అమలు అయినా.. ఎన్నికలు మాత్రం

Nara Lokesh: విద్యారంగంలో సంస్కరణలు తప్పవు

మీడియా ముందుకు ‘పుష్ప’.. అరెస్ట్‌పై ఏమన్నారంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 12:33 PM