ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు

ABN, Publish Date - Jun 15 , 2024 | 04:17 PM

ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్థిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తెలిపారు. విద్యావ్యవస్థలో మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు.

Minister Nara Lokesh

అమరావతి: ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్థిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) హామీ ఇచ్చారు. విద్యావ్యవస్థలో మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. డ్రాప్ అవుట్స్, మౌలికసదుపాయాలపై ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.

మధ్యాహ్న భోజనం పథకంపై ఆరా...

కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫేజ్-2, ఫేజ్-3 పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తోన్న మధ్యాహ్న భోజనం పథకం ఎలా ఉంది.. నాణ్యతపై అధికారులను ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం రుచితోపాటు నాణ్యతగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా మధ్యాహ్నభోజన పథకం డైరక్టర్ అంబేద్కర్‌ను ఆదేశించారు.


సమగ్ర నివేదిక ఇవ్వాలి

పాఠశాలల్లో పారిశుద్ద్య నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల పాఠశాలల్లో శానిటేషన్‌కు సంబంధించి విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష ఎస్పీడీకు స్పష్టం చేశారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులకు పాఠశాల ఎంత దూరంలో అందుబాటులో ఉందనే వివరాలతో నివేదిక రూపొందించాలని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలని మంత్రి లోకేష్ కోరారు.


ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా..

బైజూస్ కంటెంట్, ఐఎఫ్‌బీ వినియోగం మీద సమగ్ర నోట్‌ను సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ ఇవ్వకపోవడం పట్ల లోకేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా విద్యార్థులు ఎలా చదువుతారని అధికారులను ప్రశ్నించారు. తక్షణమే పాఠ్యపుస్తకాల పంపిణీకి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి, మూలన పడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పారదర్శక విధానాలను మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. పూర్తిస్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా తగిన ప్రణాళికలు తయారుచేయాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Politics: ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటారా.. అహంకారంతో ముందుకెళ్తారా..!

AP Politics: పాలనలో సంస్కరణలకు శ్రీకారం.. గతానికి.. ప్రస్తుతానికి స్పష్టమైన తేడా..

Actor Suman: కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 05:26 PM

Advertising
Advertising