Payyavula Keshav: రాష్ట్రంపై అప్పలు తెచ్చిన జగన్.. ఢిల్లీ వెళ్లింది అందుకే.. షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Nov 15 , 2024 | 01:00 PM
జగన్ ప్రభుత్వం చివరకు చిన్న పిల్లల చిక్కీల్లోనూ రూ.175 కోట్లు బకాయిలు పెట్టిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రహదారులకు రూ.810 కోట్లు కూటమి ప్రభుత్వంలో కేటాయించినట్లు తెలిపారు. ఒకటో తేదీన ఉద్యోగలకు జీతం అనేది మర్చిపోయిన ఉద్యోగులకు మేలు చేశామని మంత్రి పయ్యావుల ఉద్ఘాటించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. బడ్జెట్‌పై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. వైసీపీ సర్పంచులు ఉన్న చోట నిధులు ఇవ్వకపోవడంతో రూ. 1450 కోట్లు గ్రామాలకు అందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
జగన్ ప్రభుత్వం చివరకు చిన్న పిల్లల చిక్కీల్లోనూ రూ.175 కోట్లు బకాయిలు పెట్టిందని అన్నారు. రహదారులకు రూ.810 కోట్లు కూటమి ప్రభుత్వంలో కేటాయించినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఒకటో తేదీన ఉద్యోగులకు జీతం ఇవ్వడం మర్చిపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు మేలు చేశామని ఉద్ఘాటించారు. అమరావతికి ఇచ్చిన రూ. 15వేల కోట్లు అప్పుగా తెచ్చామో, గ్రాంటా అనేది కేంద్ర ప్రభుత్వం చెబుతుందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఢిల్లీకి వెళ్లారంటే వారి వ్యక్తిగత కేసుల కోసమేనని ఆరోపించారు. రైల్వేజోన్‌కు త్వరలోనే భూమి పూజ చేయిస్తామని తెలిపారు. రూ. 55 వేల కోట్ల జాతీయ రహదారిని రెండున్నరేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం డివెల్యూషన్‌లో రూ. 5700 కోట్లు అధనంగా ఈసారి వచ్చిందని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు, మంత్రుల ప్రతి ఢిల్లీ పర్యటన ఏదో ఒక లబ్ధిని రాష్ట్రానికి కలుగ జేస్తోందని తెలిపారు. కేన్స్‌ర్‌పై అవగాహనతోపాటు స్కీనింగ్‌కు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దళిత విద్యార్థులకు నీట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పయ్యవుల కేశవ్ హామీ ఇచ్చారు.
ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు
‘‘బడ్జెట్ పెట్టలేదు పెట్టలేదని పదేపదే వైసీపీ నేతలు అన్నారు. అసలు బడ్జెట్ పెట్టడానికి వీలు లేని విధంగా ఆర్థిక పరిస్థితిని మీరు దిగజార్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో పాలసీలు రాష్ట్ర అభివృద్దికి ప్రతికూలంగా పనిచేశాయి. అభివృద్ది కోసం అప్పులు చేయాలి తప్ప సంక్షమం కోసం అప్పులు చేయడం సరికాదు. చంద్రబాబు నాయుడు అధికారంలో దిగిపోయిన రోజు అప్పులు రూ. 3 లక్షల 75 వేల కోట్లు. జగన్ ప్రభుత్వం దిగిపోయినప్పడు ఉన్న అప్పులు రూ. 9లక్షల 70 వేల కోట్లు అంటే దాదాపు రూ.10 లక్షల కోట్లు. అప్పలు వివిధ పద్దుల కింద ఉంటాయి ఒకే చోట ఉండవు. తెచ్చిన ప్రతి రూపాయిలో 60శాతం మూలధన వ్యయంగా టీడీపీ హయాంలో పెట్టాం. జగన్ తెచ్చిన అప్పుల్లో 22 శాతం మూలధన వ్యయానికి ఖర్చు చేశారు. లెక్కల్లోకి వెళ్తే అది 15శాతమే ఉంది. రూ. 1600 కోట్లతో పట్టిసీమ కడితే అయిదేళ్లలో రూ. 44 వేలకోట్లు అది రైతాంగానికి తెచ్చిపెట్టింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యక్తిగత సంపదను పెంచడం మాత్రమే తెలుసు. రాష్ట్ర సంపదను పెంచడం వారి ఉద్దేశం కాదు’’ అని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
ఆ పథకాలను జగన్ ప్రభుత్వం ఆపేసింది...
‘‘వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన 93 పథకాలు ఆపేశారు. 100శాతం గ్రాంట్ ఇచ్చే పథకాన్ని కూడా జగన్ ప్రభుత్వం ఆపేసింది. ఇప్పడు ఒక్కో పథకం రివైవ్ చేయలంటే గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 60 పైసలు రాష్ట్రం ఇవ్వల్సిన 40 పైసలు కట్టాల్సి వచ్చింది. అప్పులు, అప్పులకు వడ్డీలు ఆ వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్ధితి ఉంది. గతంలో అప్పుల కోసం తప్పులు చేయడం చేశారు. పొరుగు రాష్ట్రాలు 8శాతం వడ్డీకి తెస్తే వీరు 10.50 శాతానికి చేశారు. ఉద్యోగులు రూ.80వేల కోట్లు సీపీసీ, స్మాల్ డిపాజిట్లు వంటివి ఉంటాయి వాటికి ప్రభుత్వం ధర్మకర్త. ఆ అకౌట్లలో రూ.80వేల కోట్లు కనపడటం లేదు.ఇందులో రూ.21 వేల కోట్లు రాజ్యాంగ బద్ధంగా విధిగా ఇవ్వల్సినవి కూడా డైవర్ట్ చేసేశారు. ఇది ఆర్థిక అరాచకం అని కూడా అనలేము అంతకు మించి చేశారు’’ అని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Kollu Ravindra: ఊగిపోయిన దువ్వాడ.. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad: సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బు రికవరీ
Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమికి ఈ వస్తువులు దానం చేయండి.. లక్ష్మీ దేవి తప్పకుండా..
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 15 , 2024 | 01:30 PM