Share News

Minister Ramanaidu: ఏపీలో రోడ్లకు మహర్దశ

ABN , Publish Date - Nov 02 , 2024 | 12:54 PM

సాక్షి ప్రకటనలకు ఖర్చుపెట్టిన రూ.300 కోట్లు కూడా కనీసం రోడ్లకు జగన్ ఖర్చు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో అధ్వాన రోడ్లతో ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవడం, వాహన మరమ్మతులకు జేబులు గుల్లవడం చూశామని అన్నారు.

Minister Ramanaidu: ఏపీలో రోడ్లకు మహర్దశ

పశ్చిమగోదావరి: కూటమి ప్రభుత్వంలో ఏపీలో రోడ్లకు మహర్దశ కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. యలమంచిలి మండలం అడవిపాలెం వద్ద పాలకొల్లు- దొడ్డిపట్ల ప్రధాన రహదారి మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ... వచ్చే సంక్రాంతి నాటికి రూ. 600 కోట్లతో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సాక్షి ప్రకటనలకు ఖర్చుపెట్టిన రూ.300 కోట్లు కూడా కనీసం రోడ్లకు జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో అధ్వాన రోడ్లతో ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవడం, వాహన మరమ్మతులకు జేబులు గుల్లవడం చూశామని అన్నారు. జగన్ పాలనలో మ్యాప్‌ని చూసి కాకుండా గుంతల రోడ్లను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తించే స్థాయికి జగన్ దిగజార్చారని మంత్రి రామానాయుడు మండిపడ్డారు.


రోడ్లపై గుంతలు లేకుండా చూస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

nadendla-manohar.jpg

విశాఖపట్నం: ఏపీవ్యాప్తంగా గుంతలులేని రహదారి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయo తీసుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పూర్ణ మార్కెట్ రామకృష్ణ థియేటర్ వద్ద, గుంతల పూడ్చివేత కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ , ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జనసేన టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... గతంలో రోడ్ల కోసం జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసిందని చెప్పారు. వైసీపీ కారణంగా ఈరోజు రోడ్లు గుంతలు పూడ్చుకునే స్థాయికి దిగజారాల్సి వచ్చిందని అన్నారు. ప్రజల సురక్షితవంతమైన ప్రయాణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.


జగన్ హయాంలోనే యురేనియం నిర్ధారణ తవ్వకాలకు అనుమతి: తిక్కారెడ్డి

కర్నూలు : జగన్ హయాంలోనే యురేనియం నిర్ధారణ తవ్వకాలకు అనుమతిచ్చారని కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. యురేనియం నిర్ధారణ తవ్వకాలపై దేవనకొండ మండల ప్రజల నిరసనల పట్ల స్పందించారు. ఇవాళ(శనివారం) కర్నూల్ జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ... యురేనియం నిర్ధారణ కోసం ఇంకా తవ్వకాలు జరపడం లేదని.. ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు. యురేనియం నిర్ధారణపై ఇప్పుడు చంద్రబాబుపై వైసీపీ నేతలు నెపం వేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అంతవరకు ప్రజలు సంయమనం పాటించాలని అన్నారు. ప్రజల అభిప్రాయం మేరకే ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని తిక్కారెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Karthika masam: కార్తీక వైభవం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు ...

MLC Election:విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

YSRCP: లైంగికంగా వేధించాడు.. మోసం చేశాడు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2024 | 04:14 PM