ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nimmala Ramanaidu: రివర్స్ టెండరింగ్ పేరుతో.. ఆ ప్రాజెక్ట్ పనులను జగన్ విధ్వంసం చేశారు

ABN, Publish Date - Jun 16 , 2024 | 05:29 PM

గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు (Polavaram project) పనులు రెండు శాతం కూడా పూర్తి చేయలేదని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు.

Nimmala Ramanaidu:

ఏలూరు: గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు (Polavaram project) పనులు రెండు శాతం కూడా పూర్తి చేయలేదని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు. చంద్రబాబు చేసిన ప్రాజెక్ట్ పనులను జగన్ విధ్వంసం చేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో కక్షసాధింపు చర్యలు, విధ్వంసం మాత్రమేనని.. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా లేదని చెప్పారు. వైసీపీ అబద్ధాలు, అసత్యాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ సీజన్‌‌లో కొన్ని మార్పులు వస్తుంటాయని చెప్పుకొచ్చారు.


అలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా పోలవరం ప్రాజెక్టును జగన్ ముంచేశారని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం) తన కార్యాలయంలో మీడియాతో మంత్రి రామానాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ.. మళ్లీ ప్రాజెక్ట్‌ను పున: నిర్మాణం చేయడానికి చంద్రబాబు నాయుడు పోలవరం వెళ్లి క్షేత్రస్థాయిలో సందర్శిస్తారని తెలిపారు. ఇది ప్రకృతి తప్పిదం కాదు గత ప్రభుత్వ తప్పిదమన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో సంవత్సరం పాటు ఏ విధమైన పనులు జరగలేదని ఫైర్ అయ్యారు.


సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్టుకు వస్తున్నారంటే అది రైతాంగానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యత అని వివరించారు. మళ్లీ అబద్ధాలతో జగన్ అధికారంలోకి రావాలనుకున్నాడని విమర్శించారు. 11 సీట్లతో ప్రజలుఆయనకు బాగా బుద్ధి చెప్పారన్నారు. రానున్న రోజుల్లో వైసీపీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో స్థానం లేదన్నారు. సేవకులు, పాలకులు మాదిరిగా ఉండాలని.. పాలకులు సేవకులుగా ఉండాలని కోరారు. అభివృద్ధి , సంక్షేమం వైపే ఎన్డీఏ ప్రభుత్వ పాలన సాగిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Politics: నారా లోకేష్‌‌‌ను కలిసిన మాజీ మంత్రి బాధితులు

Pithani Satyanarayana: ప్రతిపక్షాన్ని గౌరవించే ప్రభుత్వం మాది

Amaravati: ఆదివారమైనా తగ్గేదే లే.. లోకేష్ తీరుపై ప్రజల హర్షం..

YS Sharmila: ఫాదర్స్ డే సందర్భంగా షర్మిల భావోద్వేగ పోస్ట్..

Kodali Nani: చంద్రబాబు కాళ్ల వద్ద కొడాలి నాని.. గుంటూరులో ఫ్లెక్సీ..!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 16 , 2024 | 05:37 PM

Advertising
Advertising