YS Jagan: పులివెందులలో ముగిసిన జగన్ పర్యటన.. బెంగళూరుకు పయనం..
ABN , Publish Date - Jun 24 , 2024 | 12:56 PM
కడప జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో మండలాల వారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మూడు రోజుల పాటు నిర్వహించిన సమీక్షా సమావేశాలు సోమవారంతో ముగిసాయి.
కడప జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YCP Chief), మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Ex CM Jaganmohan Reddy) పులివెందుల (Pulivendula) నియోజకవర్గంలో మండలాల వారీగా వైసీపీ నాయకులు (YCP Leaders), కార్యకర్తలతో (Activists) మూడు రోజుల పాటు నిర్వహించిన సమీక్షా సమావేశాలు (Review Meetings) సోమవారంతో ముగిసాయి. దీంతో జగన్ పులివెందుల నుంచి హెలికాప్టర్‌లో బెంగుళూరుకు (Banglore) బయలుదేరి వెళ్లారు. సొంత గడ్డపై 3 రోజులుగా వైసీపీ నేతల నుంచే జగన్‌కు చేదు అనభవం ఎదురైంది. ‘మీ హయాంలో పులివెందుల్లో చేసిన పనులకు ఇంతవరకు బిల్లులు చెల్లించ లేక పోయావని... ఇప్పుడు మా బిల్లుల పరిస్థితి ఏంటని’ జగన్‌ను వైసీపీ కాంట్రాక్టర్లు నిలదీసారు. కాంట్రాక్టర్లు నిలదీతతో జగన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరై అసహనానికి గురయ్యారు.
నాలుగేళ్లుగా రూ. వందల కోట్ల బిల్లులు చెల్లించానని, చివరిలో కొన్ని బిల్లుల కోసం తనను ఇంత ఇబ్బంది పెడితే ఎలా అని జగన్ కాంట్రాక్టర్ల ముందు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైఎస్ భారతిని కూడా మున్సిపల్ కౌన్సిలర్ బిల్లుల కోసం నిలదీసారు. జగన్ రెడ్డి ఏదో ఒకటి చేస్తారులే అంటూ ఆమె సర్ది చెప్పారు. కాగా వైసీపీకి భారీ ఓటమి తరువాత జగన్ రెడ్డి తన వ్యాపారాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. వ్యాపారాలు కారణంగానే పులివెందుల నుంచి బెంగు ళూరుకు వెళ్లినట్లు తెలియవచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
45 రోజులపాటు.. 26 రైళ్ళ రద్దు..
చైన్ స్నాచర్లపై పోలీసుల ఉక్కు పాదం..
రెండు శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం
జగన్ జైలుకు వెళ్తే.. మా పరిస్థితి ఏంటి..?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News