ఏపీఎం మురళిపై చర్యలు తీసుకోవాలి: సీఐటీయూ
ABN , Publish Date - Mar 17 , 2025 | 11:23 PM
తంబళ్లపల్లి నియోజకవర్గం బి. కొత్తకోట మండలం బడికాయలపల్లి-4వీవో సంఘమిత్ర భారతి పేరును ఆనలైనలో తొలగించిన గత ఏపీఎం మురళిపై చ ర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు.

రాయచోటి(కలెక్టరేట్), మార్చి17(ఆంధ్రజ్యోతి): తంబళ్లపల్లి నియోజకవర్గం బి. కొత్తకోట మండలం బడికాయలపల్లి-4వీవో సంఘమిత్ర భారతి పేరును ఆనలైనలో తొలగించిన గత ఏపీఎం మురళిపై చ ర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. సోమవారం సంఘ సభ్యులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడు తూ సభ్యులు తీర్మానం చేయకుండా అకారణంగా భారతి పేరును ఆనలైనలో తొలగించడం సమంజసం కాదన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు, ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి సలీంబాషా, జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, ఏఐటీయూసీ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి బత్తల వెంక్రమణ, సంఘమిత్ర భారతి పాల్గొన్నారు.