ముగిసిన అంకాలమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:01 AM
మండల పరిధిలోని మున్నెల్లి గ్రామంలో వెలసిన అంకాల మ్మ తల్లి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి.

బి.కోడూరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని మున్నెల్లి గ్రామంలో వెలసిన అంకాల మ్మ తల్లి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. అంకాలమ్మ తల్లి ఉత్సవాలకు నగద బండ్లు, కుంకుమబండ్లు, చెక్క భజన, కోలాటం, తువ్వపల్లె, బోడు గుండుపల్లె, మున్నెల్లి గ్రామాల నుంచి సిరిమాను బండ్లు భక్తులను ఎంతగా నో ఆకట్టుకున్నాయి. అనంతరం బండ లాగుడు ’పోటీ ల్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఎడ్లకు మొదటి బహుమతి నంద్యాల జిల్లాకు చెందిన ఎడ్లకు రెండో బహుమతి గెలుచుకున్నారు. ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టిబందోబస్తు నిర్వహించారు.
అమ్మవారిని దర్శించుకున్న రితీష్‌రెడ్డి
బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇనఛార్జ్ రితీష్‌కు మార్‌రెడ్డి శనివారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికి దుశ్శాలువా, పూలమాలతో సత్క రించారు. ఆయన వెంట మండల టీడీపీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, ఓ.రమణారెడ్డి, గోడి రమణారెడ్డి, ఎల్‌ఎస్‌పీ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన వెంక టరమణారెడ్డి, వెంకటసు బ్బారెడ్డి, దదుగ్గిరెడ్డి, రామ్మోహనరెడ్డి, రాఘవరెడ్డి, పవన పాల్గొన్నారు.