సొంతింటి కలనెరవేర్చడమే సీఎం లక్ష్యం
ABN , Publish Date - Mar 17 , 2025 | 11:36 PM
సొంతింటి కళను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెరవే ర్చుతాడని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి పేర్కొన్నారు.

జమ్మలమడుగు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): సొంతింటి కళను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెరవే ర్చుతాడని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు సంబంధించిన కార్యకర్తలు, ఇతరులతో ఆయన సమావేశమై మాట్లాడారు. 2019-24 సంవత్సరంలో ఇళ్లకు సంబంధించి ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీ, బీసీ కులాలకు రూ.50 వేలు, ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐఎల్ చిన్న, పొన్నతోట మల్లి, బిర్రు సంతోష్ పాల్గొన్నారు.
రంజాన్ తోఫా పంపిణీ
జమ్మలమడుగు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో సోమవారం రాత్రి పేద ముస్లింలకు టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. రంజాన్ మాసం పురష్కరించుకుని స్థానిక నాయకులు వెంకటేశ్వర కాలనీకి చెందిన కొమెర ్ల జాకీర్ ఏర్పాటు చేసిన రంజాన్ తోఫాను భూపేశ్‌రెడ్డి హాజరై అందజేశారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటరామిరెడ్డి, కొమెర్ల మోదీన్, షేక్షావలిలున్నారు.