Share News

వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:23 PM

వేసవిలో వడదెబ్బకు గురికాకుండా వి ద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మహమ్మద్‌ రఫీ పే ర్కొన్నారు.

వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మహమ్మద్‌రఫీ

హెల్త్‌ఎడ్యుకేటర్‌ మహమ్మద్‌ రఫీ

రాయచోటిటౌన, మార్చి18(ఆంధ్రజ్యోతి): వేసవిలో వడదెబ్బకు గురికాకుండా వి ద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మహమ్మద్‌ రఫీ పే ర్కొన్నారు. మంగళవారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మే రకు రాయచోటి పట్టణంలోని డైట్‌ ఉన్న త పాఠశాల విద్యార్థులకు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మధ్యాహ్న సమయంలో విద్యార్థులు బయటకు వెళ్లకుం డా ఇళ్లలోపలే ఉండి హోమ్‌ వర్క్‌ చేసుకోవడం, చదువు కోవడం లేదా నిద్రపోవ డం చేయాలన్నారు. ఎండలో క్రికెట్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ వంటి ఆ టలు ఆడటం వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వడదెబ్బకు గురైన వారికి ఎక్కువుగా జ్వరం, తలనొప్పి, నీరసం, కళ్లు తిరగడం, విరేచనాలు, వాంతులు, నోరు ఆరిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, కలవరింతలు వంటి లక్షణాలు ఉంటాయన్నారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లటి, నీడ ప్రదేశంలోకి తీసుకెళ్లాలని, మెలకువలో ఉంటే ఉప్పు కలిసిన మజ్జిగ గానీ, ఓఆర్‌ఎస్‌ ద్రావణం గానీ తాగించాలన్నారు.చల్లటి నీటితో ముఖం కడగాలని, గాలి బాగా వచ్చే విధంగా ఫ్యాన కింద ఉండాలని, వీలైతే మాట్లాడిస్తూ ఉండాలన్నారు. అంతేగాక 108కి కాల్‌ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్నారు.ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకొని వెళ్లాలన్నారు. గంటగంటకు ఒక గ్లాస్‌ నీరు తాగాలని, ఇంటిలో కిటికీలు తెరి చి ఉంచాలని, నల్లని బట్టలు వేయరాదని, కద్దరు బట్టలు వదులుగా ఉన్నవి వేసుకోవాలని సూచించారు. దూర ప్రయాణాలు చేయరాదని, గర్భవతులు, బాలింతలు, 10 సంవత్సరాలలోపు పిల్లలు, 60 సంవత్సరాలు పైబడిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 11:23 PM