Share News

జ్యోతి క్షేత్రానికి ఇక మంచి రోజులు

ABN , Publish Date - Mar 15 , 2025 | 11:57 PM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్యోతీక్షేత్రానికి ఇక మంచి రోజులు రానున్నాయని భక్తుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

జ్యోతి క్షేత్రానికి ఇక మంచి రోజులు
ఆశ్రమంలో కూలగొట్టిన స్థానంలో తిరిగి నిర్మిస్తున్న కట్టడాలు

కూల్చిన భవనాల స్థానంలో మంత్రి నారా లోకేశ చొరవతో పునర్నిర్మాణాలు 5.5 హెక్టార్ల అటవీ స్థలానికి కేంద్రం సూచనప్రాయ అంగీకారం

భక్తుల్లో చిగురిస్తున్న ఆశలుఫగత 10 సంవత్సరాలుగా నిలిచిపోయిన గుడినిర్మాణ పనులు ఆలయ అభివృద్ధికి స్థానిక టీడీపీ నేతల కృషి

కాశినాయన మార్చి15(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్యోతీక్షేత్రానికి ఇక మంచి రోజులు రానున్నాయని భక్తుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీ వల అనుమతి లేవంటూ అటవీ శాఖాధికారులు కొన్ని నిర్మాణాలను కూల్చి వేయడం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి నారాలోకేశ స్పందించి కూల్చిన భవనాల చోటనే కొత్త వాటి కోసం పునర్మిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం తో భక్తులకు కొంత నమ్మకం ఏర్పడింది. అంతే కాకుండా ప్రభుత్వ పెద్దల సహకారంతో యుద్ధ ప్రాతిపదికన ఎంపీ పురంఽధేశ్వరి, ఎమ్మెల్యే అధినారా యణరెడ్డ్డి, నాయకులు భూపేష్‌రెడ్డి ఇతర నాయకులతోపాటు స్థానిక నేత రితేష్‌రెడ్డ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర అటవీ శాఖమంత్రి భూపేష్‌యాదవ్‌ను కలిసి సమస్యను వివరించారు. ఇందుకు స్పందించిన కేంద్ర అటవీశాఖ మంత్రి మొదటి విడతగా దాదాపు 5.5 హెక్టార్లు అటవీభూమిని కాశినాయన ఆశ్ర మానికి ఇచ్చేవిధంగా సూచనప్రాయంగా అంగీకరించారని స్థానిక టీడీపీ నాయకత్వం తీపికబురు అందించింది. దీంతో కాశినాయన భక్తులు, టీడీపీ నాయకులు కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కాశినాయన మం డలం వరికుంట్ల సమీపంలోని నల్లమల అడవుల్లో వెలసిన ఆఽధ్యాత్మిక కేత్రమే జ్యోతి. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి, అన్నపూర్ణాదేవి, కాశిరె డ్డినా యన గుడి నిత్యాన్నదాన ఆశ్రమం, రామాలయం, గోమాత సమాధి, దత్తాత్రేయ స్వామి కోవెలలు ఉన్నాయి.ప్రతి సంవత్సరం దత్తజయంతి రోజున రెండు రోజుల పాటు కాశినాయన ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి కాశినాయనను దర్శించుకొని తమకు తోచిన ధనమో, ధాన్యమో, వస్తురూపేణ సాయమందించి మొక్కులు తీర్చుకుంటారు.

ఆగిన నిర్మాణాలు: దాదాపు 30 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఓ వెలుగు వెలిగిన కాశినాయన ఆశ్రమానికి(జ్యోతి క్షేత్రానికి)అడుగడుగునా అధికారుల నుంచి అవరోదాలు ఎదురవుతూ వచ్చాయి. కేంద్ర అటవీ పరిధి లో ఉన్న కాశినాయన ఆశ్రమానికి ఫారెస్ట్ట్‌ అనుమతులు లేవంటూ ఇది టైగర్‌ జోనలో ఉందని ఫారెస్ట్ట్‌ అధికారులు అడ్డుపడ్డారు. దీంతో గత 10 సంవత్సరాలుగా కాశినాయన గుడినిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయింది.

కూల్చివేతలపై ఘాటుగా స్పందించిన కూటమి నేతలు: కేంద్ర అటవీ శాఖ ఆదేశాలను అమలు పరచే విషయంలో మార్చి 7న పోలీసు రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులు నిర్మాణా లను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న బద్వేల్‌ టీడీపీ సమన్వయకర్త కే.రితేష్‌రెడ్డి మంత్రి నారాలోకేశ దృష్టికి తీసు కుపోవడంతో ఆయన ఘాటుగా స్పందించి అన్నీ తానై అభివృద్ధిచేస్తానని భరోసా యిచ్చారు. తన ప్రతినిఽ దిగా ఖాధీ గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన కేకే చౌదరిని దూతగా పంపి 24 గంటలు తిరగక ముందే జ్యోతికి బస్సులను పునరుద్ధరించారు. సొంతఖర్చులతో పడగొట్ట్టిన నిర్మాణాల స్థానంలో కొత్త నిర్మాణాలు చేప ట్టారు. దీంతో ఢీలా పడిన కాశినాయన భక్తులకు కొండంత బలం చేకూ ర్చిందని ఆలయ ప్రదాన పూజారి జీరయ్య స్వామి, ఆలయ నిర్వాహకులు కొనియాడారు. ఈప్రభుత్వ సహకారంతో జ్యోతిక్షేత్రానికి మహర్ధశ వస్తుందని భక్తులు గట్టినమ్మకంతో ఉన్నారు.

Updated Date - Mar 15 , 2025 | 11:57 PM