Share News

చివరి ఆయకట్టుకు నీరు అందేదెలా?

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:28 PM

యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నా కుడికాలువ భాగంలో ఉన్న రైతులకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది.

చివరి ఆయకట్టుకు నీరు అందేదెలా?
నల్లగుట్టపల్లిలో రీసర్వేను పరిశీలిస్తున్న ఆర్డీవో శ్రీనివాస్‌

సుండుపల్లె, మార్చి18(ఆంధ్రజ్యోతి): యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నా కుడికాలువ భాగంలో ఉన్న రైతులకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. కుడికాలువకు పింఛా ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు. కాలువకు సరిపడా నీరు విడుదల చేయకపోవడం ఒక సమస్య అ యితే పై ప్రాంతంలో రైతులు కాలువకు అ డ్డుగా చెత్తాచెదారం వేయడంతో చివరి ఆ యకట్టుకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పింఛా ప్రాజెక్టు ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ నా గేంద్రనాయక్‌ దృష్టికి తీసుకెళ్లగా కొంత మం ది రైతులు కాలువకు అడ్డంగా కంచెలాగా ఏర్పాటు చేసి తూములకు అధికంగా నీరు అందాలన్న ఉద్దేశ్యంతో చెత్తాచెదారం వేయడంతో దిగువ భాగానికి నీరు అందించలేకపోతున్నామన్నారు. ఇకపై కాలువలో సాగునీటికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు.

Updated Date - Mar 18 , 2025 | 11:28 PM