CM Chandrababu: జగన్ చేసిన జాతి ద్రోహం ఫలితమే బెజవాడ ముంపునకు కారణం
ABN, Publish Date - Sep 10 , 2024 | 06:24 PM
ప్రజలపై విద్వేషంతో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన జాతి ద్రోహం ఫలితమే బెజవాడ ముంపునకు కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.
అమరావతి: ప్రజలపై విద్వేషంతో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన జాతి ద్రోహం ఫలితమే బెజవాడ ముంపునకు కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) విమర్శించారు. వరదలపై 10రోజుల పాటు అహర్నిశలూ శ్రమించి ఓ పెద్ద యుద్ధమే చూశానని అన్నారు. ఓ దుర్మార్గుడు నిర్లక్ష్యం ఎంతమంది పాలిట శాపమో బుడమేరు ఉగ్రరూపమే ఓ పాఠమని ఆరోపించారు. బుడమేరులో ఈరోజు(మంగళవారం) సీఎం చంద్రబాబు సందర్శించారు.
ALSO READ: CM Chandrababu: సీఎం చంద్రబాబు విజ్ఞప్తి.. ముందుకొచ్చిన ఎలక్ట్రానిక్ కంపెనీలు
వైసీపీ ప్రభుత్వం గండ్లు పూడ్చలేదు..
బాధితులను కలిసి వారికి అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బుడమేరుకు విజయవాడ నగరం వైపు పడిన 3 గండ్లను వైసీపీ ప్రభుత్వం ఎందుకు పూడ్చలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. బుడమేరు దాల్చిన ఉగ్రరూపంతో ఈ నీరు విజయవాడ నగరాన్ని ముంచెత్తటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పులివాగు కూడా వచ్చి ఇక్కడే కలిసిందని తెలిపారు. ఆర్మీ కూడా చేతులెత్తేసే పరిస్థితుల్లో మంత్రి రామానాయుడు నేతృత్వంలోని బృందం అహర్నిశలు పనిచేసి బుడమేరు గండ్లు పూడ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు.
ALSO READ:Narayana: బుడమేరు వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన
బుడమేరుపై అక్రమ కట్టడాలు..
మరో మంత్రి నారా లోకేష్ వివిధ శాఖలను సమన్వయం చేస్తూ తెరవెనుక ఎంతో కృషి చేశారని అభినందించారు. బుడమేరుపై అక్రమ కట్టడాలు కట్టి రిజిస్ట్రేషన్‌లు చేసుకోవడంతో నీరు దిగువకు పారని పరిస్థితి తలెత్తిందని విమర్శలు చేశారు. ఓ దుర్మార్గుడి పాలనలో చేసిన తప్పుడు పనులతో ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారని విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థలను గాడిలో పెట్టడానికే 2 నుంచి 3రోజుల సమయo పట్టిందని అన్నారు. ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చి గండ్లు పూడ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ప్రకాశం బ్యారేజీపై కుట్రలు..
అయినా కొన్ని లీకేజీలు ఉండటంతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బుద్ధి లేకుండా బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీకి ముప్పు తెచ్చే కుట్రలు పన్నారని ఆరోపించారు. 10రోజులు విశ్రాంతి తీసుకోకుండా రాత్రిపగలు పని చేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు, రాజకీయ ముసుగులో మాట్లాడుతున్న నేరస్తుల ముసుగు తొలగిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నేరస్తులను నేరస్తులుగానే ప్రజలముందు నిలపెడతానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
వరద నష్టంపై అధ్యయనం..
నేర సామ్రాజ్యం విస్తరణకు రాజకీయ ముసుగు తొడిగితే ఊరుకునేది లేదని మందలించారు. వరదలపై యుద్ధంలో గెలిచినా, జరిగిన నష్టాన్ని మాత్రం పూడ్చలేకపోయామని వాపోయారు. సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేయకూడదనే నియమాలుంటాయి కానీ వరదలపై యుద్ధంలో ఆ అవకాశం కూడా లేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ALSO READ: Chandrababu vs Jagan: ప్రజలతో చంద్రబాబు.. ప్యాలెస్‌లో జగన్..
రేపు ఉత్తరాంధ్రలో పర్యటిస్తా..
అంతిమంగా ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసి, అంతా నిలదొక్కుకునే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాహనాల స్పేర్ పార్ట్స్ కూడా వందశాతం సబ్సిడీ ఇచ్చేలా కంపెనీలతో మాట్లాడానని వివరించారు. రేపు ఉత్తరాంధ్రలో పర్యటిస్తానని తెలిపారు. అధికవర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖపట్నం, ఏలేరు ప్రాజెక్టు ప్రాంతాల్లో తిరిగి ఎల్లుండి నందివాడ, కొల్లేరుల్లో తిరిగి బాధితులను పరామర్శిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
ఈ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CM Chadrababu: ఇవాళ చంద్రబాబు పెళ్లిరోజు.. అయినా సరే..
Janasena: జనసేన జెండాకు ఘోర అవమానం.. భగ్గుమన్న జనసైనికులు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Sep 10 , 2024 | 06:45 PM