Share News

AP News: గత ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిందన్న అధికారులు

ABN , Publish Date - Jul 30 , 2024 | 02:14 PM

Andhrapradesh: గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం కొనసాగుతోంది. గిరిజన ప్రజలకు విద్యా పథకాలు, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో నేడు ఉన్న పరిస్థితులపై సమావేశంలో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిన విధానాన్ని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.

AP News: గత ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిందన్న అధికారులు
CM Chandrababu Naidu

అమరావతి, జూలై 30: గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సమీక్ష సమావేశం కొనసాగుతోంది. గిరిజన ప్రజలకు విద్యా పథకాలు, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో నేడు ఉన్న పరిస్థితులపై సమావేశంలో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిన విధానాన్ని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. గత ప్రభుత్వానికి గిరిజన సంక్షేమమనేది అత్యంత అప్రధాన్యత శాఖగా చూసిందని అధికారులు వెల్లడించారు.

AP News: వైసీపీ నేత అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే..


2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అధికారులు తెలిపారు. 2014-19 మధ్య కాలంలో గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పారు. అలాగే గిరిజనులకు సత్వర వైద్యం కోసం తెచ్చిన పథకాలను గత ప్రభుత్వం రద్దు చేసిన విధానంపై సీఎం సమీక్ష జరిపారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు, అరకు కాఫీ మార్కెటింగ్, ఇతర గిరిజన ఉత్పత్తుల అమ్మకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

GVL: రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎందుకు నష్టపోయిందంటే..: జీవీఎల్

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే..?

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 30 , 2024 | 02:16 PM