TDP: నాపై ఫ్యాక్షన్ కేసులెన్నో నిరూపించు.. బుగ్గనకు కోట్ల ఛాలెంజ్
ABN, Publish Date - Mar 04 , 2024 | 04:33 PM
Andhrapradesh: ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై డోన్ టీడీపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మీకు దమ్ముంటే రాజకీయం చేయండి. పోలీసులను అడ్డుపెట్టుకొని డోన్ నియోజకవర్గం వ్యాపారులు, మైనింగ్ పారిశ్రామిక వేత్తలపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదు. జగన్ కంటే నా పైన ఫ్యాక్షన్ కేసులు ఎక్కువ ఉన్నాయా?. దీనికి బుగ్గన సమాధానం చెప్పాలి’’ అంటూ డిమాండ్ చేశారు.
నంద్యాల, మార్చి 4: ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై (Minister Buggana Rajendranath Reddy) డోన్ టీడీపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి (Dhone TDP Candidate Kotla Suryaprakash Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘మీకు దమ్ముంటే రాజకీయం చేయండి. పోలీసులను అడ్డుపెట్టుకొని డోన్ నియోజకవర్గం వ్యాపారులు, మైనింగ్ పారిశ్రామిక వేత్తలపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదు. జగన్ కంటే నా పైన ఫ్యాక్షన్ కేసులు ఎక్కువ ఉన్నాయా?’’ దీనికి బుగ్గన సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గతంలో కేఈ కృష్ణమూర్తి, తాము ఫ్యాక్షన్ రాజకీయాలు ఎదుర్కొన్నాం అంతేగాని ఫ్యాక్షని ప్రోత్సహించలేదన్నారు.
AP Highcourt: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్‌కు షాక్...
మీరు పాలిటిక్స్ వదిలేస్తారా?...
‘‘బుగ్గన రాజకీయాల్లోకి నిన్న మొన్న వచ్చావ్ కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉన్నావా? డోన్ నియోజకవర్గం గురించి నీకేం తెలుసు నీ పార్టీలోకి రాకుంటే టీడీపీ శ్రేణులపైన అక్రమ కేసులు పెట్టిస్తున్నావ్. దమ్ముంటే నాపైన ఫ్యాక్షన్ కేసులు ఎన్ని ఉన్నాయో బుగ్గన నిరూపించాలి. మీ ముఖ్యమంత్రి జగన్‌పై ఎన్ని కేసులు ఉన్నాయో నిరూపిస్తాను. కేఈ కృష్ణమూర్తి, కోట్ల సుజాతమ్మ డోన్ నియోజకవర్గంలో వేల కోట్ల అభివృద్ధి చేశారు. నా పైన ఫ్యాక్షన్ కేసులు నిరూపిస్తే నేను రాజకీయం వదిలేస్తా . మీ పైన కేసులు నిరూపిస్తాం మీరు పాలిటిక్స్ వదిలేస్తారా’’ అంటూ కోట్ల ఛాలెంజ్ విసిరారు.
ఇవి కూడా చదవండి...
Babu Mohan: ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్న బాబుమోహన్
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 04 , 2024 | 05:34 PM