Minister Narayana: జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ.. మంత్రి నారాయణ వార్నింగ్
ABN, Publish Date - Nov 08 , 2024 | 09:06 PM
రబీ సీజన్‌లో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తీర్మానం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సోమశిల నుంచి 55.100 టీఎంసీల నీటిని 5.51లక్షల ఎకరాలకు, కండలేరు నుంచి 22.600 టీఎంసీలతో 2.26లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
నెల్లూరు: జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపడుతామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లాలోని కలెక్టరేట్‌లో సాగునీటి సలహా బోర్డు సమావేశం ఇవాళ(శుక్రవారం) జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి , కావ్యా కృష్ణారెడ్డి, ప్రశాంతిరెడ్డి, కురుగుండ్ల రామకృష్ణ, ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.
రబీ సీజన్‌లో 8లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి నారాయణ
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రబీ సీజన్‌లో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. సోమశిల నుంచి 55.100 టీఎంసీల నీటిని 5.51లక్షల ఎకరాలకు, కండలేరు నుంచి 22.600 టీఎంసీలతో 2.26లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోమశిల, కండలేరు జలాశయాల నుంచి 140 టీఎంసీల నీటిని ఇవ్వవచ్చని... మొత్తం 8 లక్షల ఎకరాలకు పైగా నీరందిస్తామని మంత్రి నారాయణ వివరించారు.
జగన్ ప్రభుత్వంలో కాల్వల్లో సిల్టు తీయకుండా బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. డ్రోన్ కెమెరాలతో కాల్వలన్నీ చిత్రీకరించాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. కాల్వలను వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమించారని. బుడమేరు వరదలకు కారణం ఆక్రమణలేనని స్పష్టం చేశారు. సీఎం ఆపరేషన్ బుడమేరు ప్రారంభించాలని ఆదేశాలిచ్చారని మంత్రి నారాయణ అన్నారు.
జగన్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులు ఆపేసింది: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో అన్ని నీటి ప్రాజెక్టులు ఆపేసిందని ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. నీటిని వృథా చేయొద్దని, పొదుపుగా వాడుకోవాలని సూచించారు. . పనులు చేయకుండానే రూ.కోట్ల నిధులను మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దోచుకున్నారని విమర్శించారు. 2019 తర్వాత ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభిస్తామని అన్నారు. ఈ పనుల కోసం అందరం కలిసి సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.
సంక్షేమ హాస్టళ్లలో సమస్యలుంటే కఠిన చర్యలు : కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు జిల్లా: సంక్షేమ హాస్టళ్లలో సమస్యలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఆర్ అండ్ బీ , హైవేలు, మున్సిపల్ కార్పొరేషన్, రైల్వే అధికారులతో అభివృద్ధిపై ఇవాళ(శుక్రవారం) కేంద్రమంత్రి పెమ్మసాని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కీలక విషయాలపై పెమ్మసాని చర్చించారు. నెలకోకసారి నగరంలో సమస్యలపై సమీక్షిస్తామని తెలిపారు. శంకర్ విలాస్ బ్రిడ్జి 6 నెలల్లో పూర్తి చేస్తామని మాటిచ్చారు. త్వరలో సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు చేస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Chennai: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రాకెట్ లాంఛర్ లభ్యం
KA Paul: సుప్రీంకోర్టులో కేఏపాల్‌కు చుక్కెదురు
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 08 , 2024 | 09:14 PM