ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Somireddy: టీటీడీ అంటే దోచుకునే బ్రాంచ్‌గా వారిద్దరూ చూశారు

ABN, Publish Date - Sep 22 , 2024 | 06:49 PM

పింక్ డైమండ్ అంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ట్వీట్లు చూస్తుంటే కడుపు మండిపోదా అని అన్నారు. సీఎం చంద్రబాబుని విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోలేమని వార్నింగ్ ఇచ్చారు.

MLA Somireddy Chandramohan Reddy

ప్రకాశం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి వరకు టీటీడీ అంటే దోచుకునే బ్రాంచ్‌గా చూశారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వంలో వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. టీటీడీని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.


పింక్ డైమండ్ అంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ట్వీట్లు చూస్తుంటే కడుపు మండిపోతుందని అన్నారు. సీఎం చంద్రబాబును విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోలేమని వార్నింగ్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి చంద్రబాబును విమర్శిస్తుంటే ఏపీ డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పింక్ డైమండ్ విషయం ఏంటో చెప్పకపోతే విజయసాయిరెడ్డిని బొక్కలో వేయాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.


జగన్ రెడ్డిని జైలుకు పంపాలి: కేఈ శ్యాంబాబు

కర్నూలు: తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూను జంతువుల కొవ్వుతో కల్తీ చేయించిన జగన్ రెడ్డిని జైలుకు పంపాలని పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్ అక్రమాలు చేసి కోట్లాది రూపాయల సొమ్మును దోచుకున్నారని ఆరోపణలు చేశారు. పరమ పవిత్రమైన తిరుమలలో ఇంతటి ఘోర అపచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలిపారు.

Updated Date - Sep 22 , 2024 | 07:00 PM