PKF Sridhar : ప్రభుత్వంతో ఒప్పందం వల్లే ఆడిట్ చేశాం
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:08 AM
కాకినాడ డీప్ సీ పోర్ట్, కాకినా డ సెజ్‌లోని కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కర్నాటి వెంకటేశ్వరరావు(కేవీరావు)చెందిన వాటాలను బలవంతంగా అరబిందోకు బదలాయింపు వ్యవహారంలో మంగళగిరి సీఐడీ పోలీసులు
అది వ్యవస్థీకృత నేరం కాదు.. కేసు కొట్టివేయండి
హైకోర్టులో పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం పిటిషన్
అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): కాకినాడ డీప్ సీ పోర్ట్, కాకినాడ సెజ్‌లోని కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కర్నాటి వెంకటేశ్వరరావు(కేవీరావు)చెందిన వాటాలను బలవంతంగా అరబిందోకు బదలాయింపు వ్యవహారంలో మంగళగిరి సీఐడీ పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్‌ఎల్‌పీ ఆడిట్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో దర్యాప్తుతో సహా తదుపరి చర్యలు అన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. కాకినాడ పోర్ట్ లావాదేవీల విషయంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తమ సంస్థతో ఒప్పందం చేసుకొందని పేర్కొంది. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి రూ.965 కోట్లు మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగినట్లు 2020 మార్చి 3న నివేదిక అందజేశామని తెలిపింది. దానిని నేరంగా పరిగణించడానికి వీల్లేదని తెలిపింది. కేవీరావు చేసిన ఫిర్యాదులో తమపై చేసిన ఆరోపణలు ఎలాంటి ఆధారాలు లేవంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో కోరింది.