YV Subba Reddy: అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి..
ABN, Publish Date - Sep 06 , 2024 | 11:27 AM
అక్రమ కేసులతో వైసీపీ నాయకులను అరెస్టు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(MP YV Subba Reddy) అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఇల్లు, మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును ఎంపీ ఖండించారు.
ప్రకాశం: అక్రమ కేసులతో వైసీపీ నాయకులను అరెస్టు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(MP YV Subba Reddy) అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఇల్లు, మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును ఎంపీ ఖండించారు. తమ పార్టీ నేతలను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఎంపీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.
న్యాయపోరాటం చేస్తాం..
ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. "అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారు. ఈ అరెస్టులపై న్యాయపోరాటం చేస్తాం. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపైకి వరదనీరు రాకుండా బుడమేరు మళ్లించారు. అందువల్లే విజయవాడ ప్రజలు వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ నేతలు డెవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని వైసీపీని వీడుతున్నారనేది అవాస్తవం. బాలినేనికి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. ప్రజా సమస్యలు చెప్పేందుకే ఆయన సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగారేమో. త్వరలోనే ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుణ్ని నియమిస్తాం" అని చెప్పారు.
పరారీలో వైసీపీ నేతలు..
మరోవైపు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం, సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో మంగళగిరి పోలీసులు స్పీడ్ పెంచారు. గురువారం రోజున వైసీపీ నేతలు నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేయగా.. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వైసీపీ నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాశ్, తలశిల రఘురాం కోసం హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే వారికి హైకోర్టు ముందుస్తు బెయిల్ నిరాకరించింది. ఈ మేరకు ఇద్దరు నేతలను అరెస్టు చేయగా మిగతా వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Narayana: బుడమేరు గండి పూడ్చేందుకు రంగంలోకి ఆర్మీ: మంత్రి నారాయణ..
Rain Effect: వరద బీభత్సానికి దెబ్బతిన్న వేలాది కార్లు.. గగ్గోలు పెడుతున్న వాహనదారులు..
Nimmala Ramanayudu: బుడమేరుకు పడిన గండ్ల పూడిక పనుల్లో కీలక ఘట్టం
Updated Date - Sep 06 , 2024 | 11:27 AM