Lokesh: జగన్ బిల్డప్ బాబాయి... డ్రోన్ చూసి భయపడ్డాడు
ABN, Publish Date - Mar 11 , 2024 | 01:11 PM
Andhrapradesh: ‘‘జగన్ బిల్డప్ బాబాయి... సిద్ధం సభలో డ్రోన్ చూసి భయపడ్డాడు’’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సోమవారం అనంతపురంలో జరిగిన శంఖారావం సభలో యువనేత మాట్లాడుతూ... సభకు జనం రారని తెలిసి గ్రాఫిక్స్ కోసం గ్రీన్ మ్యాట్ వేశారన్నారు. అరగంట అంబటి, బెట్టింగ్ స్టార్ అనిల్ తనను బండబూతులు తిట్టారని.. వాళ్లకు చెబుతున్నా.. ఎందుకు డ్రోన్ చూసి పిల్లుల్లా భయపడుతున్నారని వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం, మార్చి 11: ‘‘జగన్ (CM Jagan) బిల్డప్ బాబాయి... సిద్ధం సభలో డ్రోన్ చూసి భయపడ్డాడు’’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) ఎద్దేవా చేశారు. సోమవారం అనంతపురంలో జరిగిన శంఖారావం సభలో యువనేత మాట్లాడుతూ... సభకు జనం రారని తెలిసి గ్రాఫిక్స్ కోసం గ్రీన్ మ్యాట్ వేశారన్నారు. అరగంట అంబటి, బెట్టింగ్ స్టార్ అనిల్ తనను బండబూతులు తిట్టారని.. వాళ్లకు చెబుతున్నా.. ఎందుకు డ్రోన్ చూసి పిల్లుల్లా భయపడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తును (TDP-Janasena-BJP) చూసి జగన్ భయపడిపోతున్నారన్నారు. చంచల్ గూడ జైలులో కూడా జగన్ పేరు ఉండటం ఖాయమన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం.. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ హామీ ఏమైందని ప్రశ్నించారు.
టీడీపీ - జనసేన ప్రభుత్వంలో ప్రతి ఏడాది డీఎస్సీ, పెండింగ్ పోస్టులు భర్తీచేస్తామన్నారు. మాధవ్ జిల్లా పరువే కాదు... దేశం మొత్తం పరువు తీశారన్నారు. యూట్యూట్ స్టార్ భరత్, బూతుల స్టార్ సన్నబియ్యం సన్నాసి కొడాలి నాని అంటూ విరుచుకుపడ్డారు. టీడీపీ - జనసేన ఏర్పడిన ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల రూ.3వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2014లో టీడీపీ-బీజేపీ ఆనాడు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామని... ఏనాడూ మైనార్టీ సోదరులపై దాడులు జరగలేదన్నారు. సీనియర్లు, జూనియర్లను సమానంగా గౌరవిస్తానని... పనిచేసేవారినే ప్రోత్సహిస్తా, పదవులు ఇస్తామని లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Chandrababu: చంద్రబాబు నివాసానికి షకావత్ బృందం..
Janasena: ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 11 , 2024 | 01:25 PM