ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Jagan: మరీ ఇంత కక్షా?.. మరోసారి రాజధాని అమరావతిపై విషం కక్కిన జగన్

ABN, Publish Date - Mar 05 , 2024 | 12:59 PM

Andhrapradesh: విజన్ వైజాగ్ సదస్సులో రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి విషం కక్కారు. ఎన్నికల తరువాత తాను విశాఖలో ఉంటానని సీఎం చెప్పారు. మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా తాను విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. తాను విశాఖ వచ్చేందుకు అనేకసార్లు ప్రయత్నించిన రానివ్వలేదని తెలిపారు.

అమరావతి, మార్చి 5: విజన్ వైజాగ్ సదస్సులో రాజధాని అమరావతిపై (Capital Amaravati) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) మరోసారి విషం కక్కారు. ఎన్నికల (AP Elections) తరువాత తాను విశాఖలో ఉంటానని సీఎం చెప్పారు. మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా తాను విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. తాను విశాఖ వచ్చేందుకు అనేకసార్లు ప్రయత్నించిన రానివ్వలేదని తెలిపారు. కోర్ట్ కేసులు, కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేశాయన్నారు. భూ కబ్జాలు, అరాచకాలు అని ప్రచారం చేశారని మండిపడ్డారు. సీఎం వైజాగ్‌లో ఉంటే విశాఖ బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. తాను ఒక్కడినే విశాఖను కార్యనిర్వహక రాజధానిగా చేయాలనుకున్నానని.. ప్రతిపక్షం మొత్తం వ్యతిరేకించిందని తెలిపారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు అవుతుందని టీడీపీ ప్రభుత్వమే (TDP Government) చెప్పిందంటూ జగన్ అసత్యాలు పలికారు.

AP Politics: నంద్యాల లోక్ సభ బరిలో బైరెడ్డి శబరి..? ఏ పార్టీ నుంచి అంటే..?

పచ్చి అబ్బదాలు పలుకుతూ...

అమరావతిలో ఎకరానికి మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ.2 కోట్లు అవుతుందని డీపీఆర్‌ ఇచ్చారని సీఎం చెప్పారు. విశాఖలో రోడ్లు ఉన్నాయని... మంచి హోటల్స్ ఉన్నాయన్నారు. సెక్రటేరియట్ విశాఖలో అయితే ఐకానిక్ టవర్స్ కట్టవచ్చని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో నాలుగు పోర్ట్‌లు అతి వేగంతో నిర్మాణమంటూ ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు చెప్పారు. తాను విశాఖ వచ్చేందుకు తెగ ప్రయత్నం చేశానని విశాఖ వాసులను జగన్ నమ్మించే యత్నాలు చేశారు. నాలుగుసార్లు ముహూర్తం పెట్టీ మరీ సీఎం వాయిదా వేసుకున్నారు. సీఎం వస్తే అందరూ వైజాగ్ వస్తారని... అప్పుడు దానంతట అదే అభివృద్ధి చెందుతుందంటూ ముఖ్యమంత్రి జగన్ కొత్త సూత్రం చెప్పారు.

ఇవి కూడా చదవండి....

Nara Lokesh: జగన్ కంపెనీలు కళకళ...రాష్ట్ర ఖజానా దివాళ!

TS Highcourt: శ్రీనివాస్‌ గౌడ్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్ట్


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 05 , 2024 | 12:59 PM

Advertising
Advertising