Gudivada Amarnath: తిరుమల లడ్డూను కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారు
ABN, Publish Date - Sep 29 , 2024 | 06:07 PM
తిరుమల లడ్డూ విషయంపై సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. లిక్కర్ షాపులు రద్దు చేస్తూ...ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తిరుపతిలో అత్యధికంగా మద్యం షాపులు కేటాయించడాన్ని ఏమనుకోవాలి? అని గుడివాడ అమర్నాథ్ నిలదీశారు.
విశాఖపట్నం: తిరుమల లడ్డూను కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారు.. అందుకే నిన్న వైసీపీ నేతలు పూజలు నిర్వహించారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ... లేనిపోని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డైవర్ట్ రాజకీయాల కోసమే తిరుమల లడ్డూను వివాదంలోకి తీసుకువచ్చారని గుడివాడ అమర్నాథ్ అన్నారు.
ALSO READ: Nara Lokesh: క్లీన్ అండ్ గ్రీన్‌కు మంత్రి నారా లోకేష్ చర్యలు
టీడీపీ మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉందని చెప్పారు.. స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించక పోతే మద్దతు ఉపసంహరించుకుంటానని టీడీపీ నేతలు చెప్పాలని గుడివాడ అమర్నాథ్ అన్నారు. తిరుమల లడ్డూపై సీబీఐ విచారణను కూటమి నేతలు ఎందుకు కోరడం లేదు? అని ప్రశ్నించారు. తమకు సిట్‌లపై నమ్మకం లేదని చెప్పారు.
ALSO READ: AP Politics: రాజ్యసభ రేసులో ఆ ఇద్దరు.. అదృష్టం వరించేనా..
ఈ విషయంలో సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని గుడివాడ అమర్నాథ్ అన్నారు. లిక్కర్ షాపులు రద్దు చేస్తూ...ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తిరుపతిలో అత్యధికంగా మద్యం షాపులు కేటాయించడాన్ని ఏమనుకోవాలి? అని గుడివాడ అమర్నాథ్ నిలదీశారు. ఏపీలో నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయని...రాష్ట్రంలో సినిమా పోలీసులు వ్యవస్థ ఉందని గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
TG Venkatesh: సిట్ ఏర్పాటుపై టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్..
PM Modi:మోదీ ఎమోషనల్.. తెలుగు వ్యక్తిపై ప్రశంసలు..
Somireddy: జగన్‌పై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Read Latest AP News and Telugu News
Updated Date - Sep 29 , 2024 | 06:10 PM