Share News

Budget 2024: బడ్జెట్‌ 2024లో ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!

ABN , Publish Date - Jul 17 , 2024 | 01:28 PM

బడ్జెట్ 2024 తేదీ సమీపిస్తున్న కొద్దీ, అనేక సిబ్బంది, కమిటీలు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు, కేంద్ర ఉద్యోగుల జీతం, అలవెన్సులు, పెన్షన్‌తో సహా అనేక ప్రయోజనాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం బడ్జెట్‌ 2024లో కీలక ప్రకటన చేయవచ్చని ఆర్థిక వర్గాలు అంటున్నాయి.

Budget 2024: బడ్జెట్‌ 2024లో ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!
8th Pay Commission Budget 2024

2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను(budget 2024) జూలై 23న ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఈ బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని ఆర్థిక వర్గాలు అంటున్నాయి.

దీంతో దేశంలోని లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని చెబుతున్నారు. అయితే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉన్న క్రమంలో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిని అమలు చేయాలని పలు కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి.


కోటి మంది ఉద్యోగులకు లబ్ధి

బడ్జెట్ 2024 తేదీ సమీపిస్తున్న కొద్దీ, అనేక సిబ్బంది కమిటీలు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు, కేంద్ర ఉద్యోగుల జీతం, అలవెన్సులు, పెన్షన్‌తో సహా అనేక ప్రయోజనాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని, 18 నెలల డియర్‌నెస్‌ను విడుదల చేయాలటున్నారు. కేంద్ర ప్రభుత్వ కేబినెట్‌ సెక్రటరీకి రాసిన లేఖలో సెంట్రల్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ లేబర్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఎస్‌బీ యాదవ్‌ కూడా ఇప్పటికే డిమాండ్‌ చేశారు.

ఉద్యోగులకు భత్యం, కోవిడ్-19 మహమ్మారి సమయంలో పెన్షనర్లకు ఉపశమనం కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఎనిమిదో వేతన కమిషన్‌ను అమలు చేస్తే కోటి మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.


ఇప్పటికే 7వ వేతన సంఘం

ప్రతి 10 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల జీతాలు, భత్యాలు సహా అన్ని రకాల ప్రయోజనాలను సమీక్షిస్తుంది. ఆ క్రమంలో పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. వేతన సంఘం ఉద్యోగుల సమీక్ష నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తర్వాత పే కమిషన్ అమలు చేయబడుతుంది. ఏడవ వేతన సంఘాన్ని ఫిబ్రవరి 28, 2014న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత ఏడవ వేతన సంఘం జనవరి 1, 2016న అమలులోకి వచ్చింది. దీంతో ఈ నియమం ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2024 బడ్జెట్‌లో పే కమిషన్ ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

Viral Video: వందల ఉద్యోగాల కోసం పోటీ పడ్డ వేల మంది.. తొక్కిసలాట


Viral Video: కన్యాదాన్ అసలు ప్రాముఖ్యతను వివరించిన నీతా అంబానీ


Union Budget 2024: బడ్జెట్‌కు ముందు సాంప్రదాయ హల్వా వేడుక.. నోళ్లను తీపి చేసిన ఆర్థిక మంత్రి

For Latest News and Business News click here

Updated Date - Jul 17 , 2024 | 03:15 PM